Site icon NTV Telugu

Sarvam Maya: మలయాళ బ్లాక్ బస్టర్లో అదరగొట్టిన స్టార్ ప్రొడ్యూసర్ కూతురు

Sarvam Maya

Sarvam Maya

Sarvam Maya: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి మరో సెన్సేషనల్ హిట్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది అదే ‘సర్వం మాయ’. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో మరో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ సినిమాతో మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ చాలా కాలం తర్వాత ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అనే చెప్పాలి. ‘సర్వం మాయ’ విజయంలో నివిన్ పాలీ నటన ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన రియా శిబూ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమా చూసిన ప్రేక్షకులు సహా సినీ విమర్శకులు ఆమె నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన సహజసిద్ధమైన నటనతో సినిమాలో ఆ పాత్రకు ప్రాణం పోశారని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

READ ALSO: The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్‌’ సరికొత్త ట్రైలర్ చూశారా!

రియా శిబూకి సినీ రంగంతో బలమైన అనుబంధం ఉంది. మలయాళం మరియు తమిళ భాషల్లో అనేక సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత శిబూ తమీన్స్ (శిబూ కుమార్) కుమార్తె ఈ రియా. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకునే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. రియా కేవలం ఒక నిర్మాత కుమార్తె మాత్రమే కాదు, గతంలో ‘డ్యూడ్’ సినిమాతో నటుడిగా మెప్పించిన హృదు హరన్ సోదరి కూడా. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ వెండితెరపై రాణిస్తుండటం విశేషం. ఒకప్పుడు నిర్మాత శిబూ కుమార్తెగా, నటుడు హృదు హరన్ సోదరిగా ఉన్న రియాకు ఈ సినిమాతో మంచి నటిగా గుర్తింపు లభించింది.
మలయాళంలో ఇంతటి విజయం సాధించిన ఈ సినిమా త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చే అవకాశం ఉంది.

READ ALSO: The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్‌’ సరికొత్త ట్రైలర్ చూశారా!

Exit mobile version