Site icon NTV Telugu

Happy Birthday Sarfaraz Khan: సర్పరాజ్ కు డబుల్ ధమాకా.. పుట్టినరోజుకు అదిరిపోయే గిఫ్ట్

Sarfaraz Khan

Sarfaraz Khan

Happy Birthday Sarfaraz Khan: భారత జట్టు స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోమవారం రాత్రి తండ్రి అయ్యాడు. భార్య రొమానా 21 అక్టోబర్ 2024 రాత్రి కొడుకుకు జన్మనిచ్చింది. తన 26వ పుట్టినరోజుకు ముందు, సర్ఫరాజ్ ఖాన్ కొడుకు రూపంలో ఒక అందమైన బహుమతిని అందుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అభిమానులకు శుభవార్త అందించాడు. దాంతో అభిమానులు ఇప్పుడు అతనికి డబుల్ అభినందనలు చెబుతున్నారు. రెండు గంటలు గడిస్తే పుట్టినరోజును జరుపుకొనేందుకు సిద్ధంగా ఉన్న సర్పరాజ్ కు ఊహించని గిఫ్ట్ కొడుకు రూపంలో అందుకున్నాడు.

Read Also: Cylinder Blast: సిలిండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. ఆరుగురు మృతి

ఇకపోతే, సర్ఫరాజ్ ఖాన్ 22 అక్టోబర్ 1997న ముంబైలో జన్మించాడు. సర్ఫరాజ్ ఖాన్ చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఆసక్తితో అంచలంచలుగా ఎదిగి చివరికి టీమిండియా తరపున ఆడుతున్నాడు. 2015లో RCB అతనిని తమ క్యాంపులో చేర్చుకుంది. సర్ఫరాజ్ ఫిబ్రవరి 15న రాజ్‌కోట్ మైదానంలో అరంగేట్రం చేసి ప్రత్యేక మైలురాయిని కూడా సాధించాడు. తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్‌లోనే, అతను మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అతను రనౌట్ అయ్యాడు. దీని తర్వాత, అతను రెండో ఇన్నింగ్స్‌లో కూడా 68 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. సర్ఫరాజ్ క్రికెట్ కెరీర్‌లో టీమిండియా తరుపున నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 58 సగటుతో 350 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 150. ఇందులో 3 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ కూడా చేశాడు.

Read Also: Pottel : ‘పొట్టేల్’ కచ్చితంగా కొట్టేస్తుంది.. సందీప్ రెడ్డి వంగా కాన్ఫిడెంట్!

Exit mobile version