Sarfaraz Khan విధ్వంసం.. Virat Kohli అభినందన.. వీడియో వైరల్.!

  • ఆర్‌సీబీ vs సీఎస్‌కే మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్
  • కేవలం 24 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన సర్ఫరాజ్
  • సీఎస్‌కే కష్టాల్లో ఉన్న సమయంలో కీలకంగా నిలిచిన ఇన్నింగ్స్
  • క్రునాల్ పాండ్యా బౌలింగ్‌లో సర్ఫరాజ్ అవుట్
  • పెవిలియన్‌ కి వెళ్తున్న సమయంలో విరాట్ కోహ్లీ అభినందన
  • కోహ్లీ చప్పట్లు కొడుతూ క్రీడాస్ఫూర్తి చాటిన ఘటన
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Sarfaraz Khan Virat Kohli

Sarfaraz Khan Virat Kohli

Sarfaraz Khan – Virat Kohli: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ, సీఎస్‌కే (RCB vs CSK) జట్ల మధ్య జరిగిన పోరులో బెంగళూరు జట్టు చెన్నైపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకునే ఓ సందర్భం జరిగింది. మైదానంలో ప్రత్యర్థులుగా తలపడినా, క్రీడా స్ఫూర్తికి మించినది ఏదీ లేదని విరాట్ కోహ్లీ మరోసారి నిరూపించారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుత పోరాటాన్ని కోహ్లీ అభినందించడం ఇప్పుడు తెగ చర్చించుకుంటున్నారు.

BSNL Rs.1 Plan: రూ.1 ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆఫర్ అదిరిపోయిందిగా.. నెల రోజుల పాటు ఫ్రీ..

మ్యాచ్‌ లో చెన్నై జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చారు. పవర్‌ ప్లే లోనే రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మ్హత్రే, సంజూ శాంసన్ వంటి స్టార్ బ్యాట్స్మెన్స్ వికెట్లు కోల్పోయి సీఎస్‌కే 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ క్లిష్ట సమయంలో క్రీజ్ లోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ ఆర్‌సీబీపై ఎదురుదాడికి దిగారు. కేవలం 24 బంతుల్లోనే 8 ఫోర్ల సాయంతో మెరుపు అర్ధసెంచరీ పూర్తి చేసి చెన్నైని గెలుపు దిశగా తీసుకవెళ్లాడు. ఇదివరకు ఆర్‌సీబీ తరపున ఆడిన సర్ఫరాజ్.. తన పాత జట్టు బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.

అయితే క్రునాల్ పాండ్యా బౌలింగ్‌ లో సర్ఫరాజ్ అవుట్ అయి పెవిలియన్ వైపు వెళ్తున్నప్పుడు ఆసక్తికర సంఘటన జరిగింది. తన పాత టీమ్మేట్ సర్ఫరాజ్ ఆడిన పోరాట పటిమకు ముగ్ధుడైన విరాట్ కోహ్లీ, ఈల వేసి అతడిని పిలిచారు. దానితో సర్ఫరాజ్ వెనక్కి తిరిగి చూడగా, కోహ్లీ చప్పట్లు కొడుతూ అతని బ్యాటింగ్‌ ను అభినందించారు. మైదానంలో ఎంతటి వైరం ఉన్నా, ఒక మంచి ఆటగాడి ప్రతిభను గౌరవించడంలో కోహ్లీ ఎప్పుడూ ముందుంటారని ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది.

బంతి దొరికిందిరోయ్.. స్టేడియం బయట RCB Fans సందడి మాములుగా లేదుగా.. వీడియో వైరల్!

ఐపీఎల్ 2026 సీజన్‌ లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆశించిన ఫలితాలు రాకపోయినా సర్ఫరాజ్ ఖాన్ మాత్రం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆడిన మూడు మ్యాచ్‌ ల్లోనూ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ముంబైకి చెందిన ఈ స్టార్ బ్యాటర్, ప్రతి మ్యాచ్‌ లోనూ తన స్థాయిని పెంచుకుంటూ జట్టులో ఏకైక ఆశాకిరణంగా మారుతున్నాడు.