NTV Telugu Site icon

Sarfaraz-Dhruv Jurel: సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జురెల్‌కు జాక్‌ పాట్‌!

Sarfaraz Dhruv Jurel

Sarfaraz Dhruv Jurel

Sarfaraz Khan and Dhruv Jurel get BCCI Central Contracts: స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా ఆటగాళ్లు సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జురెల్‌కు జాక్‌ పాట్‌ తగిలింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో వీరికి చోటు దక్కింది. సర్ఫరాజ్‌, జురెల్‌కు గ్రేడ్‌-సీ కాంట్రాక్ట్‌ ఇస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. సోమవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్‌లో మూడు టెస్టులు ఆడిన కారణంగా బీసీసీఐ ఈ ఇద్దరికి కాంట్రాక్ట్‌ జాబితాలో చోటు కల్పించింది.

బీసీసీఐ కాంట్రాక్టు పొందాలంటే.. ఓ ఆటగాడు ప్రస్తుత సీజన్‌లో 3 టెస్టులు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జురెల్‌లు.. నాలుగు, ఐదో టెస్టులలో కూడా ఆడారు. ఈ మూడు టెస్టులను ప్రామాణికంగా తీసుకున్న బీసీసీఐ.. నేరుగా గ్రేడ్‌-సీ జాబితాలో చేర్చింది. గ్రేడ్‌-సీ కేటగీరీ కింద ఈ ఇద్దరు రూ. కోటి వార్షిక వేతనం అందుకోనున్నారు.

Also Read: SSMB29 Update: స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.. సినిమాని వేగంగా పూర్తి చేస్తాం: రాజమౌళి

టీమిండియా స్టార్ ప్లేయర్స్ శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను సెంట్రల్ కాంట్రాక్టు జాబితా నుంచి బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. బీసీసీఐ ఆదేశాలను దిక్కరించారని వారిని కాంట్రాక్టు నుంచి తొలగించింది. అయ్యర్ ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆడినా.. ఇషాన్ మాత్రం గత జనవరి నుంచి జట్టుకు దూరమయ్యాడు. దేశవాళీ క్రికెట్ ఆడలేదన్న కారణంతో శ్రేయాస్, ఇషాన్‌లకు బీసీసీఐ చోటివ్వలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Show comments