Site icon NTV Telugu

Saraswati Pushkaralu : కాళేశ్వరంలో నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు

Saraswathi Pushkaralu

Saraswathi Pushkaralu

Saraswati Pushkaralu : కాళేశ్వరంలో ఆధ్యాత్మికతతో శోభిల్లిన సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి నదిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు దంపతులు కలిసి త్రిగుణాత్మక నదుల సాన్నిధ్యంలో స్నానం చేసి పుణ్యఫలాన్ని అందుకుంటున్నారు. తీరం వెంట సైకత లింగాలను ఏర్పాటు చేసి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే, పితృదేవతలకు శ్రాద్ధకర్మలతో తీరాన్ని పరిపూర్ణంగా మార్చారు.

Nimmala Rama Naidu: మహానాడు పనుల్లో బిజీగా మంత్రి నిమ్మల.. పార చేతపట్టి మరీ..!

ఈ సాయంత్రం 7 గంటలకు త్రివేణి సంగమంలో సప్తహారతులు జరగనున్నాయి. అలాగే పుష్కరాల ముగింపు సందర్భంగా పూజారులు చండీ హోమాన్ని నిర్వహించనున్నారు. చివరి రోజు కావడంతో అధికారులు భారీగా భక్తుల రాకను ఊహించి ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం పుష్కర స్నానానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారు. అనంతరం ముగింపు వేడుకల్లో పాల్గొని నవరత్నామాల హారతిని దర్శించనున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, నాగఫణి శర్మలు పాల్గొంటారు. పుణ్యస్నానం అనంతరం భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతూ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. సరస్వతీ మాత, శుభానందదేవి అమ్మవారుల దర్శనార్థం లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఒకవైపు భక్తి భావన, మరోవైపు భక్తుల ఉత్సాహంతో కాళేశ్వరం పుష్కర క్షేత్రంగా ప్రకాశించింది.

Pawan Kalyan : వీరమల్లు నుంచి ‘తారా తారా’ సాంగ్‌కు డేట్ టూ టైం ఫిక్స్..

Exit mobile version