Sarangapani Jathakam : మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇందులో టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి సరసన తెలుగు నటి రూప కొడుయూర్ కథానాయికగా నటిస్తోంది. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం ఇది. ఈరోజు ఈ సినిమా విడుదల తేదీని వెల్లడించారు.
చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా మా చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. అతి త్వరలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చెప్పారు. ‘సారంగపాణి జాతకం’ మా సంస్థలో గుర్తుండిపోయే సినిమా అవుతుందన్నారు.
Read Also:Amir Khan : గజనీ సీక్వెల్ లో అమీర్ ఖాన్.. దర్శకుడు ఎవరంటే..?
ప్రియదర్శి పులికొండ, రూప కొడుయూర్ జంటగా నటించిన ఈ చిత్రంలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిషోర్, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి తదితరులు నటిస్తున్నారు.
‘సారంగపాణి జాతకం’ సినిమా ఇటు ప్రియదర్శికి, అటు డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటికి కీలకమే. ఇంద్రగంటి 2018లో ‘సమ్మోహనం’ సినిమాతో హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఇప్పటిదాకా ఆయనకు ఒక్క హిట్ కూడా పడలేదు. వి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలు తీశాడు. కానీ అవి ప్రేక్షకాదరణ అందుకోలేకపోయాయి. అప్పటి నుంచి ఆయన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రియదర్శి రీసెంట్ గా ‘డార్లింగ్’ అనే సినిమాతో థియేటర్లోకి వచ్చాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. 2023 లో వచ్చిన ‘బలగం’ తర్వాత ప్రియదర్శి ఖాతాలో కూడా సరైన హిట్ పడలేదు. దీంతో ఇటు హీరో అటు డైరెక్టర్ ‘సారంగపాణి జాతకం’పై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు.
Read Also:Dark Chocolate: అయ్య బాబోయ్.. డార్క్ చాక్లెట్ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా