Saptha Sagaralu Dhaati Side B : సప్త సాగరాలు దాటి సైడ్ బీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రక్షిత్ శెట్టి , రుక్మిణి వసంత్ జంటగా నటించిన లవ్ అండ్ ఎమోషనల్ మూవీ సప్త సాగరాలు దాటి సైడ్ బి..నవంబర్ 17న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజుల కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది.ఈ సినిమా కన్నడంతో పాటు తెలుగు, తమిళం మరియు మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సప్తసాగరాలు దాటి సైడ్ ఏ కమర్షియల్ హిట్‌గా నిలవగా సీక్వెల్ గా వచ్చిన సైడ్ బి మాత్రం ఫ్లాపయింది. సీక్వెల్‌పై ఉన్న అంచనాలకు తగ్గట్లుగా కథ మరియు కథనాలు లేకపోవడంతో సప్త సాగరాలు దాటి సైడ్ బీ పరాజయం పాలయ్యింది. ఈ సినిమా డిసెంబర్ 15న ఓటీటీలో విడుదల కానుంది. హీరో రక్షిత్ శెట్టినే నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు హేమంత్ రావు రచన, దర్శకత్వం చేశారు. సప్తసాగరాలు దాటి సైడ్ ఏ విడుదలైన రెండు నెలల్లోనే సైడ్ బీ కూడా విడుదలైంది.ఔట్ అండ్ ఔట్ ఫుల్ ఎమోషనల్ గా సాగే ఈ సినిమా స్లోగా రన్ అయినా అందులోని క్యారెక్టర్స్ చాలాకాలం గుర్తుండిపోయేలా చిత్రంగా తెరకెక్కింది.
మొదటి బాగం సైడ్ ఏ లో హీరో ఓ బడా కంపెనీలో కారు డ్రైవర్ గా పని చేస్తూ పాటలు పాడే తన ప్రేయసితో సంతోషంగా ఉంటూ, పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటుంటాడు. ఈ క్రమంలో ఓనర్ చేసిన యాక్షిడెంట్ ను తనపై వేసుకుని జైలుకు వెళ్లడం, తీరా లోపలికి వెళ్లాక బెయిల్ పై బయటకు తీసుకువస్తానన్న యజమాని గుండెపోటుతో చనిపోవడంతో హీరో జైలులోనే ఉండాల్సి రావడం, మధ్యలో గుండెలకు హత్తుకునే మాటలు మరియు పాటలతో కథనం ఆధ్యంతం ఎంతో ఇట్రెస్టింగ్ గా సాగుతుండగా పార్ట్1 ముగించారు.ఇక రెండో భాగం సైడ్ బీ లో హీరో బయటకు రావడం, మరొకరిని పెళ్లి చేసుకున్న ప్రేయసి గురించి ఆలోచిస్తూ తీవ్ర మానసిక వేదన చెందుతూ ఆమె సంతోషంగా ఉందా లేదా అని అనుక్షణం ఆమెనే గమనించడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమా సాగుతుంది.అలాగే తనను జైలుకు పంపించిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే సీక్వెల్ కథ ఇప్పటికే మొదటి పార్ట్ సైడ్ ఏ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుండగా, ఇప్పుడు సప్త సాగరాలు సైడ్ బీ కూడా అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 15న స్ట్రీమింగ్ కానుందని సమాచారం..
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!