NTV Telugu Site icon

Question Paper Leak: పరీక్షకు ముందే క్వశ్చన్‌ పేపర్‌ వాట్సాప్‌లో హల్చల్

Question Paper

Question Paper

Question Paper Leak: అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్వశ్చన్ పేపర్ లీక్ కలకలం సృష్టించింది. పరీక్ష ప్రారంభం కాకముందే సంస్కృతం క్వశ్చన్ పేపర్ వాట్సాప్‌లో హల్చల్ చేసింది. వర్షం కారణంగా నిన్న జరగాల్సిన పరీక్షలను రద్దు చేసి వైవీ యూనివర్సిటీ అధికారులు నేడు నిర్వహిస్తున్నారు. పరీక్షా ప్రశ్నాపత్రం ఏ విధంగా లీక్‌ అయిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం డిగ్రీ సెకండ్ ఇయర్ బీకాం, బీఎస్సీ, బీఏ గ్రూప్స్‌లకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వైవీ యూనివర్సిటీ పరిధిలో గత నెల 29 నుండి డిగ్రీ థర్డ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈనెల 21 వరకు డిగ్రీ థర్డ్ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి.

Read Also: Kakinada Ship: కదిలిన అధికార యంత్రాంగం.. కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్

 

Show comments