NTV Telugu Site icon

CM KCR : భూపాలపల్లిలో ముగ్గుల పోటీ.. ప్రత్యేక ఆకర్షణగా కేసీఆర్‌ చిత్రం

Kcr

Kcr

భూపాలపల్లి పట్టణంలోని అంబెడ్కర్ స్టేడియంలో GMRM ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి , జయశంకర్ భూపాలపల్లి జిల్లా BRS పార్టీ అధ్యక్షురాలు, వరంగల్ జిల్లా BRS పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి , GMRM ట్రస్ట్ జనరల్ సెక్రటరీ గండ్ర గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో ఎంతో ఘనంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో నియోజకవర్గ నలుమూలల నుంచి భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అయితే.. కేసీఆర్, BRS పార్టీ చిత్రం ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. అంబేద్కర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, BRS పార్టీని స్వాగతిస్తూ భారీగా ఏర్పాటు చేసిన చిత్రం అందరినీ కనువిందు చేసింది. మహిళలు వేసిన ముగ్గులను ఆసాంతం తిలకించారు ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్. దాదాపు 700 మంది మహిళలు ఈ పోటీ కార్యక్రమంలో పాల్గొని 5 విభాగాల్లో (చుక్కల ముగ్గులు,డిజైన్ ముగ్గులు, సందేశాత్మక ముగ్గులు, BRS పార్టీ గుర్తుపై ముగ్గులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై వేసిన ముగ్గులను) పరిశీలించారు.

Also Read : Sankranti 2023: పట్నం ఖాళీ.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్‌ప్లాజాల్లో రద్దీ..

అన్ని విభాగాల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి 5000, ద్వితీయ బహుమతి 3000, తృతీయ బహుమతి 2000లను విజేతలకు అందించారు. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ఆడపడుచులందరికి ప్రత్యేకంగా అభినందించి,పండుగ సందర్భంగా బహుమతులను ప్రదానం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, జడ్పీ వైస్ చైర్మన్ కల్లెపు శోభ రఘుపతి రావు, ఎంపీపీ మందల లావణ్య,మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సెగ్గం వెంకట రాణి సిద్దు, కొత్త హరిబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కటకం జనార్దన్, స్థానిక కౌన్సిలర్ ఎడ్ల మౌనిక, టౌన్ మహిళ అధ్యక్షురాలు తిరుపతమ్మ, యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు మరియు కౌన్సిలర్లు,ఇతర మండలాల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, మహిళ పోటీ దారులు పాల్గొన్నారు.

Also Read : Sania Mirza: సానియా మీర్జా సంచలన నిర్ణయం.. టెన్నిస్‌కి వీడ్కోలు