గోదావరి జిల్లాలంటే మర్యాదలకు మారు పేరు అని తెలుగు రాష్ట్రాల్లో అందరూ చెబుతారు. ఎందుకంటే.. కొత్త అల్లుళ్లకి మర్యాదలు చేయటంలో గోదారోళ్లకి పెట్టింది పేరు.. ఇక సంక్రాంతి వచ్చింది అంటే కొత్త అల్లుడికి చేసే మర్యాదలో ఆ లెక్కే వేరు. గత ఏడాది సంక్రాంతి పండుగ కు వచ్చిన కొత్త అల్లుడికి అత్తమామలు వందకు పైగా వంటకాలు రుచి చూపిస్తే.. ఈ ఏడాది ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 173 రకాలతో రుచి చూపించారు గోదావరి వాసులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యాపారవేత్త తటవర్తి బద్రి, సంధ్య దంపతుల కుమార్తె హారికకు రెండేళ్ల క్రితం హైదరాబాద్ కు చెందిన పృధ్వి గుప్తతో వివాహమైంది.
Also Read : Hindu Terrorism: హిందూ టెర్రరిజం అనేది లేదు.. ఆర్టీఐలో వెల్లడి.
అయితే.. మొదటి ఏడాది కొంత ఇబ్బంది రావటంతో పండగ నిర్వహించలేదు. రెండోసారి కరోనా వల్ల నిలిపోయింది. ఈ మూడో ఏడాది అసలు వడ్డీ కలిపి వడ్డించారు అత్తారింటోళ్లు. అల్లుడిని సంక్రాంతికి ఆహ్వానించి, అరుదైన రీతిలో 173 రకాల పిండి వంటలతో మర్యాదలు చేశారు అబ్బురపరిచారు. స్వయంగా అల్లుడికి వడ్డించి తమ ప్రేమను చాటుకున్నారు. వీరి ప్రేమను చూసి అల్లుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అతి కష్టం మీద.. అన్ని వంటకాలను రుచి చూశాడు.
Also Read : Tomato Curry Crime: మహిళ ప్రాణం మీదకు తెచ్చిన ‘టమాట కూర’