NTV Telugu Site icon

Venkatesh : 25ఏళ్ల నాటి సంక్రాంతి సీన్ రిపీట్.. ఈ సారి కూడా విక్టరీ ఆ హీరోదే

Sankranthikivasthunam

Sankranthikivasthunam

Venkatesh : సాధారణంగా సంక్రాంతి సీజన్ అంటే సినిమా వాళ్లకు పండుగ సీజన్. అదేంటి పండగ సీజన్ ఎవరికైనా పండుగ సీజనే కదా అంటే సినిమా వాళ్లకు మాత్రం అది ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు. సంక్రాంతి సీజన్ లో రావాల్సిన సినిమాల తాలూకా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్లు ఏడాది ముందు నుంచే జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే విషయం మీద ఎంత తక్కువలో లెక్క వేసుకున్నా రెండు మూడు నెలల ముందే క్లారిటీ వస్తుంది. సంక్రాంతి సినిమా వాళ్లకు కీలకమైన సీజన్ కావడంతో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి.

Read Also:AAP vs BJP: ‘‘రావణుడు బంగారు జింకగా వచ్చాడా..?’’ కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శలు..

సంక్రాంతి పండుగ సీజన్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సినిమాలు పోటీ పడుతుండడం సర్వ సాధారణం. అయితే, కొన్ని సినిమాలు హిట్ అవుతుంటాయి.. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి. ఇదే సీన్ ఈసారి సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే చూశాం. జనవరి 10న రిలీజ్ అయిన రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, జనవరి 12న నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, జనవరి 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదల అయ్యాయి. ఇక ఈ మూడు సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓవరాల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

Read Also:AP Liquor Shops: గీత కార్మికులకు మద్యం షాపులు.. నోటిఫికేషన్ జారీ

ఇదే తరహా సీన్ 25ఏళ్ల క్రితం కూడా రిపీట్ అయ్యింది. 2000 సంవత్సరంలోనూ సంక్రాంతి బరిలో ముగ్గురు హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి ‘అన్నయ్య’ జనవరి 7న.. నందమూరి బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’, వెంకటేష్ ‘కలిసుందాం రా’ చిత్రాలు జనవరి 14న రిలీజ్ అయ్యాయి. ఈ మూడింటిలోనూ ‘కలిసుందాం రా’ మూవీ ఓవరాల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇలా 25ఏళ్ల తర్వాత కూడా ఓ మెగా హీరో, నందమూరి హీరో సినిమాలకు పోటీగా దిగిన వెంకటేష్ తన విక్టరీని కంటిన్యూ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.