విక్టరీ వెంకటేష్ నటించి లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం.
Also Read : Dipawali Release Clash : దీపావళికి యంగ్ హీరోల మధ్య టగ్ ఆఫ్ వార్
కాగా ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ కు వెళ్లబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. బాలీవుడ్ కు చెందిన ఓ డైరెక్టర్ కు దర్శకత్వ భాద్యతలు ఇవ్వాలని చూస్తున్నాడు అక్షయ్. భార్య- భర్త, మాజీ ప్రేయసి వంటి ట్రయాంగిల్ కథ నేపథ్యంలో వచ్చిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఇదే కథని కాస్త అక్షయ్ స్టయిల్ లో మార్పులు చేసి తెరకెక్కించబోతున్నారు. కానీ అక్షయ్ కుమార్ కు ఇటీవల రీమేక్ లు అంతగా కలిసి రావట్లేదు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన కాంచన, ఆకాశం ని హద్దురా, మలయాళ హిట్ సినిమా డ్రైవింగ్ లైసెన్స్, సినిమాలను హింది లో రీమేక్ చేయగా డిజాస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం అక్షయ్ కు బ్లాక్ బస్టర్ హిట్ అవసరం. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ చేయడం చేయాలని భావిస్తున్నాడట అక్షయ్. ఒరిజినల్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు ఈ రీమేక్ కు కూడా నిర్మాతగా వ్యవహరించబోహున్నారు.
