Site icon NTV Telugu

Sankranthiki Vastunnam: సంక్రాంతికి వస్తున్నారు .. ఆరోజే రిలీజ్

Sankranthiki Vastunnam

Sankranthiki Vastunnam

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి – వెంకటేష్ కలిసి చేస్తున్న మూడో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి ముందు నుంచి సంక్రాంతి రిలీజ్ డేట్ ని ఫోకస్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు అదే నిజమైంది. ఈ సినిమాని జనవరి 14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఈరోజు తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనాక్షి చౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.

Also Read: Nayanthara: నయనతార వెడ్డింగ్ సీన్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఎన్ని కోట్లు చెల్లించిందో తెలుసా?

భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి శిరీష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుండగా దిల్ రాజు సినిమాని సమర్పిస్తున్నారు. నిజానికి దిల్ రాజు బ్యానర్ నుంచి గేమ్ చేంజర్ సినిమా కూడా జనవరి 10వ తేదీనే రిలీజ్ అవుతుంది. కాబట్టి సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేయకపోవచ్చు అని భావించారు. అయితే సినిమా టైటిలే సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి కచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని వెంకటేష్ పట్టుబట్టడంతో దిల్ రాజు కూడా కన్విన్స్ అయ్యారు. ఈ మేరకు ఇతర నిర్మాతలను కూడా ఒప్పించినట్లుగా తెలుస్తోంది. గేమ్ చేంజర్ సినిమాతో పాటు దిల్ రాజు ఈ సినిమాను కూడా ఎట్టకేలకు రంగంలోకి దింపినట్లయింది..ఇక తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో వెంకటేష్ సహా అనిల్ రావిపూడి, దిల్ రాజు వంటి వారు హాజరై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version