బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson: సంజు శాంసన్ (Sanju Samson) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. గ్రౌండ్ లో బ్యాట్ పెట్టాడంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చమటలు పట్టిస్తాడో.. అదే గ్రౌండ్ బయట ఎంతో సాదాసీదాగా వ్యవహరిస్తారు. ఇలాగే మరోసారి తన సరళమైన స్వభావంతో అభిమానుల మనసులు గెలుచుకున్నాడు సంజు శాంసన్. చెన్నై బీచ్‌లో స్థానిక యువకులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడిన సంజూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ క్రికెటర్ అనే హంగులు, ఆర్భాటాలు లేకుండా సాధారణ వ్యక్తిలా స్థానికులతో కలిసిపోవడం అభిమానులను ఆకట్టుకుంది.
ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంజూ కొన్ని వీడియోలు, ఫోటోలు షేర్ చేశాడు. అందులో చెన్నై బీచ్‌లో స్థానిక కుర్రాళ్లతో కలిసి క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ఎలాంటి సెక్యూరిటీ హడావిడి లేకుండా అందరితో కలిసిమెలిసి ఆడటం చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. “స్టార్ అయినా ఎంత సింపుల్‌గా ఉంటాడో చూడండి” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
Also Read
సంజూ శాంసన్ ఇప్పటికే తన సింప్లిసిటీ, వినయంతో అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు విజయానికి కీలక ఇన్నింగ్స్ ఆడి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు చెన్నై బీచ్‌లో స్థానికులతో కలిసి గడిపిన ఈ క్షణాలు CSK అభిమానుల్లో అతడిపై మరింత ప్రేమను పెంచాయి. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సంజూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై జట్టుకు మారిన తర్వాత అతడు కీలక ఆటగాడిగా మారిపోయాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో సీఎస్కే ఐదో స్థానంలో కొనసాగుతోంది. తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కోనుంది.
మైదానంలో కూడా సంజూ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 56 బంతుల్లో అజేయంగా 115 పరుగులు చేసి సీఎస్కే వికెట్ కీపర్‌గా అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. దీంతో MS Dhoni పేరిట ఉన్న 84 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. అంతేకాదు, సీఎస్కే చరిత్రలో ఐపీఎల్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్‌పై వాంఖడే స్టేడియంలో 54 బంతుల్లో అజేయంగా 101 పరుగులు చేసి సీఎస్కే తరఫున అక్కడ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో సంజూపై సీఎస్కే భారీగా ఆధారపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అతడు 40కి పైగా పరుగులు చేసిన మ్యాచ్‌ల్లో సీఎస్కే 100% విజయాలు సాధించింది. కానీ అతడు విఫలమైన మ్యాచ్‌ల్లో జట్టు విజయశాతం కేవలం 16.7% కి పడిపోయింది.
Sanju anna casually becoming part of the gang 😭 pic.twitter.com/2JaGS1XDI3
— Team Samson (@teamsamsonX) May 12, 2026
తాజావార్తలు
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!