Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home T20 World Cup Sanju Samson One Request To Suryakumar Yadav During Icc Mens T20 World Cup Captain Reveals After Title Win

Sanju Samson: టీ20 వరల్డ్‌కప్‌లో కెప్టెన్‌ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్‌..! ఆ సీక్రెట్‌ను లీక్‌ చేసిన సూర్య..

Published Date :March 11, 2026 , 6:11 pm
By Sudhakar Ravula
Sanju Samson: టీ20 వరల్డ్‌కప్‌లో కెప్టెన్‌ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్‌..! ఆ సీక్రెట్‌ను లీక్‌ చేసిన సూర్య..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sanju Samson: టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో విజయభేరి మోగించి.. కప్‌ను అందుకుంది టీమిండియా.. భారత్‌ సెమీస్‌ చేరాల్సిన మ్యాచ్‌.. ఆ తర్వాత సెమీస్‌.. ఫైనల్‌ మ్యాచ్‌లోనూ సంజు శాంసన్ ఇన్నింగ్స్‌ మరువలేనివి.. టీమ్ ఇండియాకు తాను ఎంత ముఖ్యమైన ఆటగాడో దీంతో మరోసారి నిరూపించాడు. ICC Men’s T20 World Cup సందర్భంగా అతను జట్టు కోసం చూపిన అంకితభావం గురించి టీమ్ కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించాడు.

కెప్టెన్ ముందు సంజు ఒక్క మాట
టోర్నమెంట్ ప్రారంభంలో జట్టు కాంబినేషన్ల కారణంగా సంజు శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఆ సమయంలో అతను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను కలిసి ఒకే ఒక మాట చెప్పాడట. “జట్టుకు నేను ఏమి చేయగలను చెప్పండి” అని సంజు అడిగాడని సూర్య వెల్లడించాడు. ఒక ఆటగాడి నుంచి ఇలాంటి జట్టు కోసం ఆలోచించే వైఖరి రావడం టీమ్‌కు పెద్ద బలం అని సూర్య తెలిపారు.

బెంచ్ ప్లేయర్లను మేనేజ్ చేయడం కష్టం
ప్రపంచ కప్ సమయంలో కెప్టెన్‌గా తనకు అత్యంత కష్టమైన పని ప్రతి మ్యాచ్‌లో ఆడే అవకాశం రాని ఆటగాళ్లను మానసికంగా సిద్ధంగా ఉంచడం అని సూర్య చెప్పారు. ఎప్పుడైనా అవకాశం వస్తే సిద్ధంగా ఉండటం వారికి సవాల్‌గా ఉంటుందని పేర్కొన్నారు. అందుకే వారితో ఎక్కువ సమయం గడిపి మాట్లాడటం అవసరం అవుతుందని తెలిపారు. మరోవైపు.. టోర్నమెంట్ ప్రారంభంలో అవకాశాలు రాకపోయినా, నాకౌట్ దశలో సంజు శాంసన్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ అవకాశాన్ని అతను అద్భుతంగా వినియోగించుకున్నాడు. వెస్టిండీస్‌పై సూపర్ 8 మ్యాచ్‌లో అజేయంగా 97 పరుగులు.. సెమీఫైనల్‌లో 89 పరుగులు.. ఫైనల్‌లో కూడా 89 పరుగులు.. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో భారత జట్టు టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు సంజు శాంసన్..

ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
కేవలం ఐదు ఇన్నింగ్స్‌లలోనే సంజు శాంసన్ 321 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అతని అద్భుతమైన ప్రదర్శనను గుర్తించి అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా లభించింది. అయితే, వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయమే ముఖ్యమని సంజు శాంసన్ చెప్పడం అతని టీమ్ స్పిరిట్‌ను మరోసారి చూపించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ICC Men’s T20 World Cup news
  • Indian Cricket Team News
  • Sanju Samson performance World Cup
  • Sanju Samson player of the tournament
  • Sanju Samson T20 World Cup

తాజావార్తలు

  • Sanju Samson: టీ20 వరల్డ్‌కప్‌లో కెప్టెన్‌ ముందు సంజు శాంసన్ ఒకే ఒక డిమాండ్‌..! ఆ సీక్రెట్‌ను లీక్‌ చేసిన సూర్య..

  • Afghanistan: ఇవేం బుద్ది తక్కువ పనుల్రా బాబు.. ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికల విద్యపై శాశ్వత నిషేధం!

  • Bank Minimum Balance: మినిమం బ్యాలెన్స్ లేదని రూ.19 వేల కోట్లు వసూలు.. లబోదిబోమంటున్న ఖాతాదారులు..

  • LPG Crisis: రోజుకు 2 సార్లు భోజనం.. పూరీ, దోస బంద్.. హస్టల్స్‌‌కు ‘‘గ్యాస్ మంటలు’’..

  • Rumali Roti Recipe: ఇంట్లోనే మృదువైన రుమాలి రోటీ ఇలా తయారు చేసుకోండి

ట్రెండింగ్‌

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions