NTV Telugu Site icon

Sanju Samson: సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్‌.. ఈసారైనా మెరుస్తాడా?

300 Sixes Sanju Samson

300 Sixes Sanju Samson

Ishan Kishan Doubtful for Duleep Trophy 2024: టీమిండియా వికెట్ కీపర్, కేరళ ఆటగాడు సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్‌ అనే చెప్పాలి. దేశవాళీ టోర్నీ దులిప్‌ ట్రోఫీ 2024లో సంజూ ఆడే అవకాశాలు ఉన్నాయి. గాయం కారణంగా దులీప్ ట్రోఫీలో మొదటి మ్యాచ్‌కు టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ ఇషాన్ కిషన్ దూరమయ్యే అవకాశం ఉంది. అతడి స్థానంలో శాంసన్‌ ఆడనున్నట్లు తెలుస్తోంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని టీమ్ డి జట్టులో కిషన్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే.

ఇషాన్‌ కిషన్‌ గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చాడు. సరైన కారణం చెప్పకపోవడంతో బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. రంజీ ట్రోఫీలో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి.. సెంట్రల్‌ కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. ఏడాది కాలంగా జట్టుకు దూరమైన ఇషాన్‌.. దిద్దుబాటు చర్యలకు దిగాడు. ఈ క్రమంలోనే ఇటీవల బుచ్చిబాబు ఇన్విటేషనల్‌ టోర్నీ బరిలో ఆడాడు. సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్‌ సెంచరీ బాదాడు. ఈ టోర్నీలోనే అతడికి గాయమైనట్లు క్రిక్‌బజ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబరు 5న ఆరంభమయ్యే దులిప్‌ ట్రోఫీ మొదటి మ్యాచ్‌కుఇషాన్‌ అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది.

Also Read: Samsung Galaxy A06 Price: 50 ఎంపీ కెమెరా, 5000 బ్యాటరీ.. 10 వేలకే ‘శాంసంగ్‌’ ఫోన్!

ఇషాన్‌ కిషన్‌ స్థానంలో సంజూ శాంసన్‌ ఇండియా-డి జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని క్రిక్‌బజ్‌ తెలిపింది. ఇటీవల శ్రీలంక పర్యటనలో సంజూ విఫలమయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. దాంతో సంజూని బీసీసీఐ సెలెక్టర్లు పక్కనపెట్టారు. దులిప్‌ ట్రోఫీ 2024కి ఎంపిక చేయలేదు. అనుకోకుండా వచ్చే అవకాశాన్ని అయినా అతడు ఉపయోగించుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. భారత్ తరపున 30 టీ20లు, 16 వన్డేలు ఆడిన సంజూ.. 1000 పరుగులు కూడా చేయలేదు. అయితే ఐపీఎల్‌లో మాత్రం 168 మ్యాచ్‌లలో 4419 రన్స్ చేశాడు.

Show comments