Sanju Samson: సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్.. ఈసారైనా మెరుస్తాడా?
- ఇషాన్ కిషన్‌కు గాయం
- దులిప్ ట్రోఫీ 2024కి దూరం
- శాంసన్‌కు లక్కీ ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ishan Kishan Doubtful for Duleep Trophy 2024: టీమిండియా వికెట్ కీపర్, కేరళ ఆటగాడు సంజూ శాంసన్‌కు లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. దేశవాళీ టోర్నీ దులిప్ ట్రోఫీ 2024లో సంజూ ఆడే అవకాశాలు ఉన్నాయి. గాయం కారణంగా దులీప్ ట్రోఫీలో మొదటి మ్యాచ్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ దూరమయ్యే అవకాశం ఉంది. అతడి స్థానంలో శాంసన్ ఆడనున్నట్లు తెలుస్తోంది. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని టీమ్ డి జట్టులో కిషన్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే.
ఇషాన్ కిషన్ గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వచ్చాడు. సరైన కారణం చెప్పకపోవడంతో బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. రంజీ ట్రోఫీలో ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి.. సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. ఏడాది కాలంగా జట్టుకు దూరమైన ఇషాన్.. దిద్దుబాటు చర్యలకు దిగాడు. ఈ క్రమంలోనే ఇటీవల బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీ బరిలో ఆడాడు. సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్ సెంచరీ బాదాడు. ఈ టోర్నీలోనే అతడికి గాయమైనట్లు క్రిక్‌బజ్ ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబరు 5న ఆరంభమయ్యే దులిప్ ట్రోఫీ మొదటి మ్యాచ్‌కుఇషాన్ అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
Also Read: Samsung Galaxy A06 Price: 50 ఎంపీ కెమెరా, 5000 బ్యాటరీ.. 10 వేలకే ‘శాంసంగ్’ ఫోన్!
ఇషాన్ కిషన్ స్థానంలో సంజూ శాంసన్ ఇండియా-డి జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని క్రిక్‌బజ్ తెలిపింది. ఇటీవల శ్రీలంక పర్యటనలో సంజూ విఫలమయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. దాంతో సంజూని బీసీసీఐ సెలెక్టర్లు పక్కనపెట్టారు. దులిప్ ట్రోఫీ 2024కి ఎంపిక చేయలేదు. అనుకోకుండా వచ్చే అవకాశాన్ని అయినా అతడు ఉపయోగించుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. భారత్ తరపున 30 టీ20లు, 16 వన్డేలు ఆడిన సంజూ.. 1000 పరుగులు కూడా చేయలేదు. అయితే ఐపీఎల్‌లో మాత్రం 168 మ్యాచ్‌లలో 4419 రన్స్ చేశాడు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!