NTV Telugu Site icon

Sanju Samson: అచ్చం ధోనిలా.. సంజు సాంసన్ రనౌట్.. వీడియో వైరల్..!

10

10

ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా శనివారం నాడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ అద్భుతమైన రన్ అవుట్ చోటుచేసుకుంది. ముందుగా ఈ మ్యాచ్ లో తక్కువ స్కోర్ నమోదైన కానీ లక్ష ఛేదనలో చివరి వరకు విజయం కోసం ఇరు జట్లు నువ్వా.. నేనా.. అన్నట్లు పోరాడాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ వైపు విజయం వరించింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో ‘నో లుక్.. రన్ అవుట్’ చేసిన సంజు సాంసన్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు అచ్చం మహేంద్రసింగ్ ధోని చేసిన రనౌట్ లాగానే సాంసన్ కూడా చేశాడంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also read: LSG vs KKR: లక్నోపై కోల్కతా ఘన విజయం.. రాణించిన ఫిల్ సాల్ట్

ఇంకా పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న ఇన్నింగ్స్ 18 ఓవర్ లో యుజ్వేంద్ర చాహల్ వేసిన బంతిని పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మ లెగ్ సైడ్‌ కు స్లాగ్ చేయడంతో ఈ రనౌట్ జరిగగా.. నాన్ స్ట్రైకింగ్‌ లో ఉన్న లియాయ్ లివింగ్‌ స్టోన్ ఒక పరుగు పూర్తి చేసుకుని స్ట్రైకింగ్ వైపుకు వచ్చాడు. ఇక మరోవైపు, అరంగేట్ర ఆటగాడు తనుష్ కోటియాన్ బంతిని వేగంగా కీపర్ శాంసన్‌ కు అందించాడు. అయితే త్రో మాత్రం కాస్త వికెట్లకు దూరంగా రావడంతో ధోనీ స్టైల్‌ లో సంజు సాంసన్ వెనక్కి తిరిగిచూడకుండా బెయిల్స్‌ ను గిరాటేశాడు. దీంతో పరుగుకు ప్రయత్నించిన లివింగ్‌ స్టోన్ రనౌట్ అయ్యాడు.

Also read: Railway Recruitment 2024: రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా..

ఇకపోతే ఇందుకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో అనేకమంది అచ్చం మహేంద్ర సింగ్ ధోనీ చేసిన రన్ అవుట్ లాగానే ఈ రన్ అవుట్ ను కూడా పోలుస్తున్నారు. మరికొందరైతే.. అదృష్టం కలిసి వచ్చి సంజు వేసిన బాల్ వికెట్లను తాకిందని లేదంటే లివింగ్‌ స్టోన్ బతికి పోయేవాడిని కామెంట్ చేస్తున్నారు.