Site icon NTV Telugu

Sanju Samson Post: టీమిండియాలో దక్కని చోటు.. సంజూ శాంసన్ పోస్ట్ వైరల్!

Sanju Samson

Sanju Samson

India Batter Sanju Samson’s Cryptic Post After Australia ODIs Snub: వెస్టిండీస్‌లో పేలవ ప్రదర్శన టీమిండియా బ్యాటర్ కమ్ కీపర్ సంజూ శాంసన్‌కు శాపంలా మారింది. ఆసియా కప్ 2023లో చోటు దక్కని సంజూకి ప్రపంచకప్‌ 2023 ముంగిట ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో కూడా అవకాశం దక్కలేదు. అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ సోమవారం భారత జట్టును ప్రకటించగా.. శాంసన్‌కు చోటు దక్కలేదు. ఆసీస్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించాక.. సంజూ తన ఫేస్‌బుక్ ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. సంజూ తన ఫేస్‌బుక్ ఖాతాలో నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు.

సంజూ శాంసన్‌ 2015లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. ఫ్యూచర్ స్టార్ అవుతాడని అప్పుడు అందరి ప్రశంసలు పొందిన సంజూ.. 8 ఏళ్ల తర్వాత కూడా జట్టులో చోటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సంజూకి అరకోర అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ.. అతడిని పూర్తిగా వాడుకోవాలనే ఉద్దేశం మాత్రం లేనట్టు వ్యవహరిస్తోంది. మరోవైపు రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ కీపర్లుగా రాణించడం కూడా సంజూ తుది జట్టులోకి రాలేకపోతున్నాడు.

ఐపీఎల్ 2023లో రాణించిన సంజూ శాంసన్‌కు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో అవకాశం దక్కింది. ఆపై వెస్టిండీస్‌లో అవకాశం వచ్చినా.. పేలవ ప్రదర్శన చేశాడు. దాంతో ఆసియా కప్ 2023 టోర్నీకి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. అదే సమయంలో కౌంటీ క్లబ్ కాంట్రాక్ట్ వచ్చినా.. ఆసియా కప్ కోసం వదిలేశాడు. కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి.. సూపర్ 4 మ్యాచ్‌ల కోసం శ్రీలంకకు రావడంతో సంజూ స్వదేశానికి వచ్చేశాడు. రాహుల్ కోలుకోకపోతే.. వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీకి రిజర్వు ప్లేయర్‌గా సంజూని ఆడించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ అందుకుంది. ఈ కారణంగానే చైనాలో త్వరలో జరగాల్సిన ఆసియా క్రీడలకు కూడా సంజూని ఎంపిక చేయలేదు.

Also Read: Realme Narzo 60x 5G Launch: రియల్‌మీ నార్జో 60ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు షురూ.. ఎక్కడో తెలుసా?

ఆసియా కప్ 2023లో కేఎల్ రాహుల్ సెంచరీ చేయడం, ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్‌లో రాణించడంతో సంజూ శాంసన్‌ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది. తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో కూడా సంజూకి చోటు దక్కలేదు. దాంతో ఏడవాలో లేదా నవ్వాలో అర్ధం కానీ అతడు ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ఎమోజీని పోస్ట్ చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో సంజూ ఇప్పటివరకు 13 వన్డేల్లో, 24 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రెండు ఫార్మాట్‌లలో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 8 ఏళ్ల కెరీర్లో ఇంత తక్కువ మ్యాచులు ఆడడం దురదృష్టమే అని చెప్పాలి.

Exit mobile version