Sanju Samson Century: ఇది కదా కావాల్సింది.. సంజూను అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson Century: గురువారం రాత్రి జరిగిన మరో హై వోల్టేజ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి అద్భుత అజేయ శతకంతో మెరిశాడు. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో సంజూ బ్యాటింగ్ కు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ కేవలం 54 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి చివరి బంతికి బౌండరీ కొట్టి, మొత్తంగా ఓవర్‌లో 16 పరుగులు సాధించి తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.
ఇక చివరి బంతికి సెంచరీ అందుకున్న సంజూను ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్వయంగా మైదానంలో హైఫైవ్ ఇచ్చి అభినందించాడు. ఆయనతో పాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా అతని దగ్గరకు వెళ్లి కంగ్రాట్స్ తెలిపాడు. అలాగే టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఏకంగా సంజూను హాగ్ చేసుకుని అభినందించడంతో అభిమానులు కూడా కేరింతలు పెట్టారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌కు స్టేడియంలో ఉన్న అభిమానులు మాత్రమే కాదు, సీఎస్‌కే క్యాంప్, అలాగే ముంబై ఇండియన్స్ అభిమానులు కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అతని బ్యాటింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇది ఈ సీజన్‌లో సంజూ శాంసన్‌కు రెండో శతకం. ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ పై 56 బంతుల్లో 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పటివరకు ఐపీఎల్ 2026లో నమోదైన ఐదు సెంచరీల్లో రెండింటిని సంజూనే సాధించడం విశేషం. ఈ సీజన్ లో క్వింటన్ డి కాక్ (112), అభిషేక్ శర్మ (135), తిలక్ వర్మ (101) లు సెంచరీలతో మెరిశారు.
What a player 🔥
Sanju Samson lights up Wankhede with a sensational century 💯💛
✅ First century by a CSK batter vs MI
✅ 5th century in #TATAIPL#TATAIPL 2026 | #MIvCSK | LIVE NOW 👉 https://t.co/vkBKeocOG2 pic.twitter.com/CrPljNVO3Y— Star Sports (@StarSportsIndia) April 23, 2026
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!