NTV Telugu Site icon

World Cup 2023: ఏంటి బాస్.. వచ్చిన అవకాశాలను వదిలేసుకుంటున్నారు..

Sanju

Sanju

విరాట్ కోహ్లీ సారథ్యంలో యజ్వేంద్ర చాహాల్ టీమిండియాలో ప్రధాన స్పిన్నర్‌గా ఉంటూ వచ్చాడు. అయితే అతనికి టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో చోటు దక్కలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024 టీ20 వరల్డ్ కప్ లో కూడా చాహాల్ ఆడేది అనుమానంగానే ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 5 మ్యాచుల్లో 5 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఇక, కుల్దీప్ యాదవ్ 4 మ్యాచుల్లో 6 వికెట్లు తీసి మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు.

Read Also: Business Idea: రూ.15 వేల పెట్టుబడితో రూ.4 వేలు పొందే అవకాశం.. ఈ బిజినెస్ తో అదిరిపోయే లాభాలు..

వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20లో 4 ఓవర్లలో యుజ్వేంద్ర చాహాల్ 51 రన్స్ సమర్పించుకున్నాడు. మరో ఎండ్‌లో కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో కేవలం 18 రన్స్ మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. అక్షర్ పటేల్ ఒక్క ఓవర్లో 8 పరుగులే ఇచ్చాడు. టీ20 ఇన్నింగ్స్‌లో 50కి పైగా రన్స్ ఇవ్వడం యజ్వేంద్ర చాహాల్‌కి ఇది నాలుగో సారి. అయితే, మరో ప్లేయర్ యంగ్ సంజూ శాంసన్, వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. గత ఏడాది ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో 77 పరుగులు మినహాయిస్తే.. ఆ తర్వాత ఆడిన 22 మ్యాచుల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు.

Read Also: Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో ఘోరం.. వర్ష బీభత్సంతో 29 మంది మృతి

వెస్టిండీస్ తో తొలి టీ20లో 12 పరుగులు చేసి సంజూ శాంసన్.. రెండో మ్యాచ్‌లో 7 పరుగులు, మూడు, నాలుగో మ్యాచుల్లో శాంసన్ కి బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. ఇక, ఫైనల్ మ్యాచ్‌లో 9 బంతుల్లో 13 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహాల్ ప్రదర్శన చూస్తుంటే.. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో స్థానం సంపాదించుకోవడం డౌట్ గానే ఉంది. ఇక, ఈ సంవత్సరం జరిగే వన్డే వరల్డ్ కప్ లోనూ వీళ్లు ఆడడం కష్టమే.. ఎందుకంటే కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే, అతనితో పాటు ఇషాన్ కిషన్‌కి వికెట్ కీపర్‌గా టీమ్‌లో స్థానం దక్కే ఛాన్స్ ఉంది.

Read Also: Himachal Floods: వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఏడుగురు.. వీడియో షేర్‌ చేసిన సీఎం

అలాగే కుల్దీప్ యాదవ్‌ని ప్రధాన స్పిన్నర్‌గా సెలక్టర్లు తీసుకునే అవకావం ఉంది. అతనితో పాటు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లను స్పిన్ ఆల్‌రౌండర్లుగా ఎంచుకునే ఛాన్స్ కనిపిస్తుంది. భారత్‌లో చాహాల్ కు మంచి ట్రాక్ రికార్డు ఉన్నా.. గత రెండు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఈసారి అయినా వరల్డ్ కప్ ఆడతాడో లేదో అనేది మరి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది.

Show comments