Site icon NTV Telugu

KL Rahul-Sanjeev Goenka: అప్పుడు ఛీవాట్లు.. ఇప్పుడు విందు ఏర్పాట్లు.. హగ్ చేసుకున్న ఫొటో వైరల్

Kl Rahul

Kl Rahul

సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జేయింట్స్ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. 165 పరుగులు చేసింది. ఈ క్రమంలో.. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఒక్క వికెట్ కోల్పోకుండా విజయం సాధించింది. ఈ క్రమంలో.. లక్నో సూపర్‌ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ పై విరుచుకుపడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read Also: Botsa Satyanarayana: జగన్‌ విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు..

ఈ వీడియోను చూసి నెటిజన్లు, క్రికెట్ అభిమానులు, క్రికెట్ దిగ్గజాలు తీవ్రంగా స్పందించారు. ఏదైనా ఉంటే.. సీక్రెట్ గా అడగాలి కానీ, ఇలా బహిరంగంగా కెప్టెన్ పట్టుకుని విమర్శించడం సరికాదని తెలిపారు. మరికొంత మంది అభిమానులైతే.. లక్నో సూపర్‌ జెయింట్స్ జట్టును విడిచిపెట్టమని కేఎల్ రాహుల్‌కు సలహా ఇచ్చారు. మరోవైపు.. ఈ కామెంట్స్ నేపథ్యంలో కేఎల్ రాహుల్ జట్టు నుంచి వెళ్లిపోతారన్న వార్తలు కూడా వచ్చాయి.

Read Also: Snacks: 5 రూపాయిల కుర్కురే కొనివ్వలేదని భర్తను వదిలేసిన అర్ధాంగి

కానీ.. తాజాగా ఈ ఫోటోను చూస్తే.. వారి మధ్య గొడవ సద్దుమణిగినట్లు అనిపిస్తోంది. ఫొటోలో కేఎల్ రాహుల్ ను కౌగిలించుకున్నట్లు కనిపిస్తుంది. సోమవారం రాత్రి కేఎల్ రాహుల్‌ను సంజీవ్ గోయెంకా విందుకు ఆహ్వానించారు. అనంతరం కేఎల్ రాహుల్‌ను కౌగిలించుకున్నట్లు కనిపిస్తుంది. కాగా.. వీరిద్దరూ కౌగిలించుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ ఫొటో చూసిన అభిమానులు.. ఓనర్, కెప్టెన్ మధ్య అంతా బాగానే ఉందని అంటున్నారు. కాగా.. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలనే లక్నో సూపర్‌జెయింట్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. లక్నో మిగిలున్న రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు చాలా ఉన్నాయి.

Exit mobile version