NTV Telugu Site icon

Sania Mirza-Shoaib Malik Divorce: సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌‌ విడాకులు కన్ఫార్మ్.. ఒక్క పోస్ట్‌తో..!

Sania Mirza Shoaib Malik

Sania Mirza Shoaib Malik

Sania Mirza-Shoaib Malik Divorce: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌‌ల విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటునున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు కారణం లేకపోలేదు. తాజాగా షోయబ్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చాడు. ఇదివరకు ‘సూపర్ ఉమెన్ సానియా మీర్జా’ అని బయోలో ఉండగా.. ఇప్పుడు ‘ప్రో అథ్లెట్ – లైవ్ అన్‌బ్రోకెన్’ అని ఉంది.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ‘ప్రో అథ్లెట్ – లైవ్ అన్‌బ్రోకెన్’తో పాటుగా ‘ఓ​ బిడ్డకు తండ్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది’ అని కూడా పేర్కొన్నాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ బయో పిక్ వైరల్‌గా మారింది. దీంతో షోయబ్ మాలిక్‌, సానియా మీర్జాలు విడాకులు తీసుకోవడం ఖాయం అని నెటిజన్లు అంటున్నారు. ఈ వార్తలపై ఇప్పటివరకు అటు సానియా కానీ, ఇటు షోయబ్‌ కానీ ఎవరూ స్పందించలేదు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: Amaranth Health Benefits: షుగర్ పేషేంట్స్ తప్పనిసరిగా తినాల్సిన తృణధాన్యం ఇదే.. సూపర్బ్ రిసల్ట్!

గతేడాది నుంచే షోయబ్ మాలిక్‌, సానియా మీర్జాల సంసార జీవితం సాఫీగా సాగడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం పాకిస్థానీ నటి అయేషా ఉమర్‌తో మాలిక్‌ ఎఫైర్ నడపడమే అట. కొన్నాళ్ల క్రితం మాలిక్‌కు అయేషాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందట. భర్త మోసం చేయడంతోనే సానియా విడాకుల వరకు వెళ్లిందని సమాచారం. అయితే ఇద్దరు కలిసి చేస్తున్న ‘ది మీర్జా మాలిక్ షో’ కారణంగానే విడాకులు తీసుకోవడం లేదట. ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారట. కొన్నాళ్లుగా సానియా, మాలిక్‌ల విడాకుల వార్తలు సైలెంట్ అవ్వగా.. తాజాగా మాలిక్ బయోతో మరోసారి చర్చకు దారితీసింది. ఇక సానియా, మాలిక్‌ల వివాహం 2010లో జరగ్గా.. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు.

Also Read: Dry Hair Solution: ఈ హెయిర్ మాస్క్‌ను అప్లై చేస్తే.. 15 రోజుల్లో ఒత్తైన, నల్ల జుట్టు మీ సొంతం!

 

Sania Shoiab Bio

Show comments