Sania Mirza-Shoaib Malik Divorce: సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు కన్ఫార్మ్.. ఒక్క పోస్ట్‌తో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sania Mirza-Shoaib Malik Divorce: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటునున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు కారణం లేకపోలేదు. తాజాగా షోయబ్ తన ఇన్స్టాగ్రామ్ బయోను మార్చాడు. ఇదివరకు ‘సూపర్ ఉమెన్ సానియా మీర్జా’ అని బయోలో ఉండగా.. ఇప్పుడు ‘ప్రో అథ్లెట్ – లైవ్ అన్బ్రోకెన్’ అని ఉంది.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తన ఇన్స్టాగ్రామ్ బయోలో ‘ప్రో అథ్లెట్ – లైవ్ అన్బ్రోకెన్’తో పాటుగా ‘ఓ బిడ్డకు తండ్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది’ అని కూడా పేర్కొన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బయో పిక్ వైరల్‌గా మారింది. దీంతో షోయబ్ మాలిక్, సానియా మీర్జాలు విడాకులు తీసుకోవడం ఖాయం అని నెటిజన్లు అంటున్నారు. ఈ వార్తలపై ఇప్పటివరకు అటు సానియా కానీ, ఇటు షోయబ్ కానీ ఎవరూ స్పందించలేదు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read
- E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
Also Read: Amaranth Health Benefits: షుగర్ పేషేంట్స్ తప్పనిసరిగా తినాల్సిన తృణధాన్యం ఇదే.. సూపర్బ్ రిసల్ట్!
గతేడాది నుంచే షోయబ్ మాలిక్, సానియా మీర్జాల సంసార జీవితం సాఫీగా సాగడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం పాకిస్థానీ నటి అయేషా ఉమర్‌తో మాలిక్ ఎఫైర్ నడపడమే అట. కొన్నాళ్ల క్రితం మాలిక్‌కు అయేషాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందట. భర్త మోసం చేయడంతోనే సానియా విడాకుల వరకు వెళ్లిందని సమాచారం. అయితే ఇద్దరు కలిసి చేస్తున్న ‘ది మీర్జా మాలిక్ షో’ కారణంగానే విడాకులు తీసుకోవడం లేదట. ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారట. కొన్నాళ్లుగా సానియా, మాలిక్‌ల విడాకుల వార్తలు సైలెంట్ అవ్వగా.. తాజాగా మాలిక్ బయోతో మరోసారి చర్చకు దారితీసింది. ఇక సానియా, మాలిక్‌ల వివాహం 2010లో జరగ్గా.. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు.
Also Read: Dry Hair Solution: ఈ హెయిర్ మాస్క్‌ను అప్లై చేస్తే.. 15 రోజుల్లో ఒత్తైన, నల్ల జుట్టు మీ సొంతం!

Sania Shoiab Bio
తాజావార్తలు
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!