Australian Open Final: కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాకు శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో బిగ్ షాక్ తగిలింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి సూపర్ పెర్ఫామెన్స్‌తో ఫైనల్‌కు చేరి.. ఫైనల్‌లో బ్రెజిలియన్ జోడీ లూయిసా స్టెఫానీ, రాఫెల్ మాటోస్ చేతిలో సానియా-బోపన్న జోడీ ఘోరమైన ఓటమి చవిచూసింది. రాడ్ లావర్ ఎరీనాలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ ఓటమిని మూటగట్టుకుంది. వరుస రెండు సెట్లలో 6-7 (2-6), 2-6తో ఓటమి పాలయ్యారు.
అద్భుత ఆటతీరుతో దూసుకుపోయిన సానియా – బోపన్న జోడీ సెమీఫైనల్‌లో బ్రిటన్, అమెరికాకు చెందిన నీల్ సుపాస్కి-డిసీర్ క్రాజిక్‌లపై 7-6, 6-7, 10-6 తేడాతో విజయాన్ని సాధించి గ్లాండ్‌స్లామ్ ఫైనల్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. క్వార్టర్స్‌లో వాకోవర్ లక్‌తో సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సానియా-బోపన్న జోడి.. సెమీస్‌లో పాయింట్ పాయింట్‌కి పోరాడాల్సి వచ్చింది. కెరీర్‌లో సానియా మీర్జాకు ఇదే చివరి గ్లాండ్‌స్టామ్ టోర్నమెంట్. ఫిబ్రవరిలో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు ఇటీవలే సానియా స్పష్టం చేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచి కెరీర్‌ను ఘనంగా ముగించే అవకాశం సానియాకు లభించింది. ఫైనల్‌లో సానియా – బోపన్న జోడి ఇదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటివరకు రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ చేజిక్కించుకుంది సానియా. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఒకసారి, మరోసారి విమెన్స్ డబుల్స్‌లో విజేతగా నిలిచింది. మరో మూడు సార్లు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
Ind vs NZ T20: న్యూజిలాండ్‌తో భారత్ ఢీ.. తొలి టీ20లో సీనియర్లు లేకుండానే..
సానియా తన కెరీర్‌లోని ఆఖరి గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లో చిరస్మరణీయమైన ప్రదర్శనను ప్రదర్శించింది, చాలా వరకు తన అద్భుతమైన ఫోర్‌హ్యాండ్‌ను ఆటలో అద్భుత ప్రతిభను కనబరిచింది. వచ్చే నెలలో దుబాయ్‌లో జరిగే డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్‌లో భారత ఏస్ తన చివరి టోర్నమెంట్ ఆడనుంది.