Sangareddy Murder Case: జంట హత్యల ఘటన సంగారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లాలోని తెల్లాపూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ జంట హత్యలు మొత్తం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. మహిళతో పాటు 13 ఏళ్ల బాలుడిని శివరాజ్ అనే వ్యక్తి హత్య చేశాడు. అనంతరం ఆయన తన గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
READ ALSO: PMO Driver Salary : ప్రధాని మోడీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా?
పోలీసుల కథనం ప్రకారం.. ఐదు రోజుల క్రితం తెల్లాపూర్‌కు శివరాజ్, చంద్రకళ అనే ఇద్దరు వచ్చి తమను తాము భార్యాభర్తలుగా పరిచయం చేసుకున్నారు. వీరితో పాటు 13 ఏళ్ల బాలుడు కూడా వచ్చాడు. ఈ క్రమంలో గురువారం శివరాజ్.. చంద్రకళను, ఆమెతో పాటు వచ్చిన 13 ఏళ్ల బాలుడిని హత్య చేశాడు. అనంతరం తన గొంతు కొసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని శివరాజ్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చంద్రకళ, బాలుడి హత్యలకు సంబంధించిన కారణాలు తెలియరావాల్సి ఉంది. సంగారెడ్డి పోలీసు మాట్లాడుతూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
READ ALSO: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGSRTC లో 198 పోస్టులకు నోటిఫికేషన్