NTV Telugu Site icon

Sandra Venkata Veeraiah : ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చేలా కేసీఆర్ పాలన ఉంది

Sandra

Sandra

ఖమ్మం సత్తుపల్లి లో బీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని మాట్లాడుతూ.. కేసీఆర్ సహకారంతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం లో ఓక మట్టి రోడ్డు లేని ఊరు ఉందంటే దానికి కారణం కేసీఆర్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. పట్టణభివృద్ది కోసం 5 కోట్ల కేటాయించిన కేటీఆర్‌.. సత్తుపల్లి నియోజకవర్గానికి ఏం కావాలంటే అది అందించి సత్తుపల్లి కీర్తిని పెంచారు కేసీఆర్‌, కేటీఆర్‌ లు అని ఆయన వ్యాఖ్యానించారు. మూడు సార్లు ప్రజల అభిమానంతో ఎమ్మెల్యే గా గెలుపొందానని, అహంతో అహంభావం తో ఏనాడు పనిచేయలేదన్నారు సండ్ర. దళితుడైన నేనే సత్తుపల్లి లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశానని, బీఅర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఏం అభివృద్ది జరుగుతుందో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ప్రపంచం లోనే గుర్తింపు తెచ్చేలా కేసీఆర్ పాలన ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Ayodhya idol: అయోధ్యలోని ఓ రహస్య ప్రాంతంలో తయారవుతున్న రాముడి శిల్పం

ఇదిలా ఉంటే.. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఆరాధ్యదైవం అని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల అన్నారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి, నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్‌ పార్కును ప్రారంభించారు. 1.37 కోట్లు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ తెలుగు చరిత్రలో ఎన్టీఆర్ విశిష్టతను చాటిచెప్పారు. భారతదేశంలో తెలుగు ప్రజల ఉనికిని గుర్తించి ప్రాతినిధ్యం వహించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన పేర్కొన్నారు. రాముడు, కృష్ణుడు వంటి పూజ్యమైన వ్యక్తులతో పోల్చిన కేటీఆర్ ప్రజల మనస్సులపై ఎన్టీఆర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తారకరామారావు పేరు పెట్టుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

Also Read: TDP Motha Mogiddam: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా మోత మోగించిన టీడీపీ నేతలు