Allu Arjun: అలాంటి వారికి దూరంగా ఉండండి.. ఫాన్స్‌కు అల్లు అర్జున్ రిక్వెస్ట్!
- సంధ్య థియేటర్ వద్ద తీవ్ర విషాదం
- అసెంబ్లీ సమావేశాల్లో స్పందించిన సీఎం
- ఫాన్స్‌కు అల్లు అర్జున్ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ రాకతో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా.. బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలో కొందరు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి.. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించిన విషయం బన్నీ దృష్టికి రాగా.. ఆయన స్వయంగా ఎక్స్ వేదికగా స్పందించారు.
సోషల్ మీడియాలో నెగెటివ్ పోస్టులు పెట్టే వారికి దూరంగా ఉండాలని అల్లు అర్జున్ తన ఫాన్స్‌కు సూచించారు. ‘నా ఫాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీ, ప్రొఫైల్స్‌తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడుతాయి. నెగెటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా ఉండాలని నా ఫాన్స్‌కు సూచిస్తున్నా’ అని ఐకాన్ స్టార్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అర్జున్ అరెస్టు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సంధ్య థియేటర్ ఘటనపై సీఎం మాట్లాడారు. ఒక్కరోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన హీరో ఇంటి దగ్గర క్యూ కట్టి మరీ.. ప్రభుత్వాన్ని తిడుతున్నారన్నారు. కొందరు అడ్డగోలుగా పోస్టులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని సీఎం మండిపడ్డారు. దాంతో అల్లు అర్జున్ తన అభిమానులకు రిక్వెస్ట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.
I appeal to all my fans to express their feelings responsibly, as always and not resort to any kind of abusive language or behavior both online and offline. #TeamAA pic.twitter.com/qIocw4uCfk
— Allu Arjun (@alluarjun) December 22, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!