NTV Telugu Site icon

Sandeep Reddy Vanga: ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాకు నా మొదటి ఛాయిస్ అతడే.. కానీ కుదరలేదు!

Vijay Deverakonda On Movie Production

Vijay Deverakonda On Movie Production

Allu Arjun was a first choice for Arjun Reddy Movie Said Sandeep Reddy Vanga: విజయ్‌ దేవరకొండ హీరోగా, సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అర్జున్‌ రెడ్డి’. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్‌ దేవరకొండను తెలుగు ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది అర్జున్‌ రెడ్డి సినిమానే. ఈ సినిమా అనంతరం విజయ్‌ దేవరకొండతో పాటు సందీప్‌ రెడ్డి వంగా పెద్ద స్టార్స్ అయ్యారు. అయితే ఈ ఇండస్ట్రీ హిట్ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో తీయాలనుకున్నట్లు సందీప్‌ చెప్పారు.

ఇటీవల ఇండియా టుడేకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. అర్జున్‌ రెడ్డి పాత్రకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన మొదటి ఎంపిక అని తెలిపారు. ‘2011లో అల్లు అర్జున్‌కు కథ చెప్పాను. కొన్ని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. దురదృష్టవశాత్తూ అర్జున్‌ రెడ్డి కథను ఆయనకు వినిపించడానికి అవకాశం రాలేదు. ఆ స్క్రిప్ట్‌తో చాలామంది నటులు, నిర్మాతలను కలిశాను. చివరకు నేనే నిర్మించా. విజయ్‌ దేవరకొండ నాకు ఓ స్నేహితుడి ద్వారా పరిచయం. అల్లు అర్జున్‌ను కలవడం కుదరకపోవడంతో విజయ్‌తో సినిమా తీశా. 13 సంవత్సరాల తర్వాత బన్నీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడానికి ఆతృతగా ఉన్నా’ అని సందీప్ చెప్పారు.

Also Read: Guntur Kaaram: బాబుతో అట్లుంటది మరి.. విడుదలకు ముందే ‘గుంటూరు కారం’ సరికొత్త రికార్డు!

‘యానిమల్‌’ సినిమా విజయంతో సందీప్ రెడ్డి వంగా పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. సందీప్ చేసింది మూడు సినిమాలే అయినా.. భారీ క్రేజ్ సంపాదించారు. తెలుగులో ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో పాపులర్ అయిన సందీప్.. అదే సినిమాను హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో తీసి స్టార్ అయ్యారు. ఇక యానిమల్‌ సినిమాతో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం సందీప్‌ ‘స్పిరిట్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్‌ హీరోగా ఈ సినిమా తెరకెక్కనున్న ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్‌ తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేసే అవకాశం ఉంది.

Show comments