Sandeep Reddy Vanga : “యానిమల్ పార్క్” రిలీజ్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ “యానిమల్ “..ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది .అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాపై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలుతో విమర్శలు కూడా వచ్చాయి . విపరీతమైన హింస ,మహిళలను కించ పరిచే విధంగా ఈ మూవీ ఉందంటూ ఎక్కువగా విమర్శలు వచ్చాయి.మరోవైపు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్ల వర్షం కురిపించింది.అయితే తన సినిమాపై విమర్శలు చేసే వారిపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఘాటుగా స్పందిస్తున్నారు.ఇదిలా ఉంటే యానిమల్ మూవీకి సీక్వెల్‌గా యానిమల్ పార్క్ తెరకెక్కనుంది అంటూ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.యానిమల్ పార్క్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు . ఈ చిత్రంపై ప్రేక్షకులలో క్రేజ్ విపరీతంగా నెలకొని ఉంది.
అయితే యానిమల్ పార్క్ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తాజాగా సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్ ఇచ్చారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ ఈ విషయాన్ని తెలియజేసారు .యానిమల్ పార్క్ సినిమా షూటింగ్ 2025 ఎండింగ్ లో మొదలవుతుందని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. యానిమల్ మూవీతో పోలిస్తే యానిమల్ పార్క్ మరింత వైల్డ్‌గా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.యానిమల్ పార్క్ షూటింగ్ 2025 ఎండింగ్ లో మొదలు పెట్టి 2026 లో రిలీజ్ చేయనున్నట్లు సందీప్ వెల్లడించారు. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో రూపొందించే ‘స్పిరిట్’ సినిమా స్క్రిప్ట్ పనుల్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం బిజీగా ఉన్నారని తెలుస్తుంది.ఈ మూవీ స్క్రిప్ట్ పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయని ఇటీవల సందీప్ తెలిపారు.సెప్టెంబర్ లో స్పిరిట్ షూటింగ్ మొదలవుతుందని ఆయన తెలిపారు.
Also Read
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
- Modi - Meloni - Melody: జార్జియా మెలోనికి మోడీ స్పెషల్ గిఫ్ట్..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్‌కి షాక్ ఇచ్చిన మిత్రపక్షాలు.. ‘రెండు ఆకుల’ రాజకీయంలో దళపతి వెనకడుగు!
-
Peddi: తమిళ్, మలయాళ బాక్సాఫీస్‌పై ‘పెద్ది’ దండయాత్ర మొదలు!
-
Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
ట్రెండింగ్
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!