NTV Telugu Site icon

Sandeep Reddy Vanga : “యానిమల్ పార్క్” రిలీజ్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..

Whatsapp Image 2024 04 24 At 2.28.10 Pm

Whatsapp Image 2024 04 24 At 2.28.10 Pm

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ “యానిమల్ “..ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది .అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాపై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలుతో విమర్శలు కూడా వచ్చాయి . విపరీతమైన హింస ,మహిళలను కించ పరిచే విధంగా ఈ మూవీ ఉందంటూ ఎక్కువగా విమర్శలు వచ్చాయి.మరోవైపు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్ల వర్షం కురిపించింది.అయితే తన సినిమాపై విమర్శలు చేసే వారిపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఘాటుగా స్పందిస్తున్నారు.ఇదిలా ఉంటే యానిమల్ మూవీకి సీక్వెల్‍గా యానిమల్ పార్క్ తెరకెక్కనుంది అంటూ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.యానిమల్ పార్క్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు . ఈ చిత్రంపై ప్రేక్షకులలో క్రేజ్ విపరీతంగా నెలకొని ఉంది.

అయితే యానిమల్ పార్క్ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తాజాగా సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్ ఇచ్చారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ ఈ విషయాన్ని తెలియజేసారు .యానిమల్ పార్క్ సినిమా షూటింగ్ 2025 ఎండింగ్ లో మొదలవుతుందని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు. యానిమల్‍ మూవీతో పోలిస్తే యానిమల్ పార్క్ మరింత వైల్డ్‌గా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.యానిమల్ పార్క్ షూటింగ్ 2025 ఎండింగ్ లో మొదలు పెట్టి 2026 లో రిలీజ్ చేయనున్నట్లు సందీప్ వెల్లడించారు. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‍తో రూపొందించే ‘స్పిరిట్’ సినిమా స్క్రిప్ట్ పనుల్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం బిజీగా ఉన్నారని తెలుస్తుంది.ఈ మూవీ స్క్రిప్ట్ పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయని ఇటీవల సందీప్ తెలిపారు.సెప్టెంబర్ లో స్పిరిట్ షూటింగ్ మొదలవుతుందని ఆయన తెలిపారు.