Site icon NTV Telugu

Sandeep Reddy Vanga: గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పిన సందీప్ రెడ్డి వంగా..!

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన తన మొదటి సినిమాతోనే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన తన సెకండ్ సినిమాగా అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్‌ పేరుతో తీసి సక్సెస్ కొట్టారు. తర్వాత సినిమాగా రణబీర్ కపూర్‌తో యానిమల్ వంటి సెన్సేషనల్ సినిమా తీసిన రణబీర్ కెరీర్‌లోనే సూపర్ హిట్ సినిమాను అందించారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నారు.

READ ASLO: Andhra Pradesh: రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు.. మూడు జిల్లాల్లో చైన్ దొంగతనాలు !

ఇటీవల ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పారు. ఆయన 5వ తరగతిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనను తన ఫ్రెండ్ కాంత్రి ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. సందీప్‌కు ఆ టైంలో ఒక అమ్మాయి అంటే ఇష్టం ఉండేదని కాంత్రి అన్నారు. ఈ సందర్భంగా కాంత్రి మాట్లాడుతూ.. స్కూల్ అయిన తర్వాత ఆ అమ్మాయి రిక్షాలో వాళ్ల ఇంటికి వెళ్తుంటే సందీప్ తన సైక్కిల్‌పై ఆ అమ్మాయి వెనక వెళ్లే వాడని చెప్పాడు. అలా కొన్ని రోజులు ఆ అమ్మాయి వెనుక పడ్డాడని చెప్పాడు. ఒక రోజు సందీప్‌కు సప్రైజ్ ఇవ్వడానికి తనకు చెప్పకుండా తనని ఫాలో చేసినట్లు ఆయన వెల్లడించాడు. ఆ రోజు సందీప్ తన సైక్కిల్ మీద నుంచి కిందపడ్డాడని, అప్పుడు ఆ అమ్మాయి బాగా నవ్విందని అన్నాడు. ఆ అమ్మాయి ఆ రేంజ్‌లో నవ్వడంతో ఎక్కడ సందీప్ బాధపడుతాడేమో అని అనుకుంటే.. తను పైకి లేచి తన సైక్కిల్ తీసుకొని హ్యాండిల్ వదిలేసి తొక్కడం వంటి ఫీట్లు చేయడం స్టార్ట్ చేశాడని చెప్పాడు. సందీప్ యాటిట్యుడ్‌కు ఆ అమ్మాయి ఫిదా అయ్యిందని అన్నారు. దీనిపై సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. క్రాంతి చెప్పింది నిజమే అని అన్నారు. ఆ రోజుల్లో ఆ అమ్మాయి వెనక పడి ఘోరంగా కింద పడ్డట్లు చెప్పాడు. ఆమె నవ్వడంతో ఆమె వెళ్తున్న రిక్షాను ఓవర్ టేక్ చేసి తన సైక్కిల్ హ్యాండిల్ వదిలేసినట్లు వెల్లడించారు. ఆ రోజుల్లో అలా జరిగిపోయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రభాస్ స్పిరిట్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌గా ఫ్యాన్స్‌కు స్వీట్ సప్రైజ్ ఇచ్చారిన సంగతి తెలిసిందే.

READ ASLO: Gautam Gambhir: మెల్‌బోర్న్‌లో గౌతమ్ గంభీర్ స్ట్రాటజీ మిస్ ఫైర్..

Exit mobile version