Site icon NTV Telugu

Spirit: ప్రభాస్ తో కలిసి నటించాలని అనుకుంటున్నారా.. మీకే బంపర్ ఆఫర్?

Prabhas Movies

Prabhas Movies

సినిమాల్లో నటించాలని ఎంతోమందికి ఉంటుంది కానీ ఆ అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. అయితే ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం ఉందని ప్రస్తుతం ఆయనతో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాతగా భద్రకాళి పిక్చర్స్ అనే బ్యానర్ ఉన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి ఈ బ్యానర్ మీదే నిర్మించారు తర్వాత సందీప్ రెడ్డివంగా చేసే దాదాపు అన్ని సినిమాలలో ఈ బ్యానర్ కూడా సహనిర్మాణ సంస్థగా వ్యవహరిస్తూ ఉంటుంది.

READ MORE: Amartya Sen: కాంగ్రెస్-ఆప్ ఐక్యత చాలా అవసరం, కలిసి పోరాడాల్సింది..

తాజాగా ఈ బ్యానర్ సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా తాము తెరకెక్కించే ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం అన్ని వయసుల వారికి కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే సినిమా లేదా థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు మాత్రమే అందుకు అర్హులు అని ప్రకటించారు. ఒక హెడ్ షాట్ ఫోటోతో పాటు పర్సనల్ షాట్ ఫోటో కూడా జత చేయాలని కోరారు. ఇక ఇంట్రడక్షన్ వీడియోలో మీ పేరు ఇతర వివరాలు వెల్లడించడంతోపాటు మీ చదువుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించాలని కోరారు. ఈ మేరకు వివరాలను spirit.bhadrakalipictures@gmail.com కి పంపాలని కోరారు. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రభాస్ తో నటించాలని ఆసక్తి ఉన్నవారు మీ ఫోటో సహా ఇంట్రడక్షన్ వీడియో రికార్డు చేసి పైన పేర్కొన్న జిమెయిల్ అకౌంట్ కి పంపి లక్ పరీక్షించుకోండి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

Exit mobile version