సందీప్ రెడ్డి వంగా.. ఈ దర్శకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు.. అర్జున్ రెడ్డి సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి మూవీని హిందీలో కబీర్‌సింగ్‌గా తెరకెక్కించి బాలీవుడ్‌లో కూడా భారీ హిట్ అందుకున్నాడు. అయితే ఈ దర్శకుడు కాస్త గ్యాప్ తీసుకోని బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్ తో యానిమల్ చిత్రాన్ని తెరకెక్కించాడు.. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది.అలాగే యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్ రణ్ బీర్ తండ్రి పాత్రలో నటించారు.బాబీ డియోల్ విలన్ గా నటించారు.ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్ మరియు మురద్ ఖేతని నిర్మిస్తున్నారు.
యానిమల్ మూవీ డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో యానిమల్ మూవీ టీం ప్రమోషన్స్ ఇంటర్వ్యూస్ లో పాల్గొంటుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేస్తున్నారు.. తాజాగా సందీప్ మూవీ సెట్స్‌లో టైమింగ్స్ మెయింటైనెన్స్ గురించి మాట్లాడుతూ.. రణ్‌బీర్‌కపూర్ ఒక్క రోజు కూడా సెట్స్‌కు ఆలస్యంగా రాలేదు. అతడు తరచుగా నా ఆఫీస్‌కు వచ్చేవాడు. నేనే ఇంకా ఆలస్యంగా వెళ్లేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే యానిమల్ మూవీలో ఎవరూ కూడా ఊహించనటువంటి ఇంటర్వెల్ సీన్ ఉంటుంది.. అది ప్లాన్ చేస్తే రాదు..నాకు తెలిసి అది ఐకానిక్ ఇంటర్వెల్‌గా నిలిచిపోతుందని సందీప్ అన్నారు.. ఈ సీక్వెన్స్ చాలా కాలం గుర్తుండిపోతుంది. యానిమల్ మూవీ లో 25 హై లెవల్ ఇంపాక్ట్ సన్నివేశాలుంటాయని సందీప్ తెలిపారు.. యానిమల్ మూవీ వర్కవుట్ అయితే నెక్ట్స్ మరింత డార్క్‌షేడ్స్ ఉన్న సినిమా చేయాలని రణ్‌బీర్‌కపూర్ అనుకుంటున్నట్లుగా సందీప్ తెలిపారు