Samyuktha Menon : ఆ విషయంలో మలయాళీ సినిమానే సౌకర్యంగా ఉంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళీ భామ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో ఈ భామ వరుస విజయాలు అందుకొని దూసుకుపోతుంది.తన అందం,అభినయంతో ఈ మలయాళీ భామ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం ఈ భామ మళయాళంతో పాటు తెలుగు మరియు తమిళ్ భాషలో కూడా వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా వుంది.తాజాగా ఈ భామకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.సౌత్ ఇండియన్ భాషలన్నింటిలో నటిస్తున్నారు కదా మీకు ఏ భాషలో నటించడం సౌకర్యంగా ఉంటుంది..అని అడుగగా దీనికి సంయుక్త మీనన్ ఆసక్తికర సమాధానమిచ్చింది.
నాకు నటించడం అంటే ఎంతో ఇష్టం..అది ఏ భాష అయిన కూడా ఎంజాయ్ చేస్తూ నటిస్తాను. అయితే.. సౌకర్యం గురించి మాట్లాడితే నా మాతృభాష మలయాళంలో ఉన్నంత సౌకర్యం మిగతా భాషల్లో నటించేటప్పుడు ఉండదు అని సంయుక్త మీనన్ తెలిపింది..ఇతర భాషలు నేర్చుకుంటూ నటించాలి.మలయాళంలో అది అవసరం ఉండదు.అలాగే మలయాళంలో మేకప్ కూడా ఎంతో లైట్‌గా వేస్తారు. అక్కడ హీరోయిన్ ఎంతో నేచురల్‌గా కనిపిస్తూనే నటించాలి. ఇతర బాషలలో అలా ఉండదు. మేకప్ ఎక్కువ ఉంటుంది. యాక్టింగ్ కూడా కాస్త డిఫరెంట్‌గా చేయాలి.షాట్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు తానూ మేకప్ చెక్ చేసుకోవాలి.అలా నిత్యం మేకప్ వేసుకోవడంతో చర్మంపై ఏదో బరువు ఉన్నట్టు అనిపిస్తుంటుందని సంయుక్త తెలిపింది.
Also Read
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!