NTV Telugu Site icon

Samsung Galaxy S24 FE: ‘గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ’ వచ్చేసింది.. ధర,ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!

Samsung Galaxy S24 Fe Price

Samsung Galaxy S24 Fe Price

Samsung Galaxy S24 FE Price in India: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ ‘శాంసంగ్‌’ గెలాక్సీ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ’ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్‌ చేసింది. ప్రీమియం సెగ్మెంట్‌లో ఏటా తీసుకొచ్చే ఎస్‌ సిరీస్‌ ఫోన్లకు కొనసాగింపుగా శాంసంగ్‌.. కాస్త తక్కువ ధరలో ఫ్యాన్‌ ఎడిషన్‌ను (ఎఫ్‌ఈ) లాంచ్‌ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఏఐ ఫీచర్లనూ ఇందులో అందించింది. ఇందులో 4700 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 ఎంపీ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ కెమెరాను ఇచ్చారు.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అన్ని ఫోన్లలోనూ 8జీబీ ర్యామ్‌ కామన్‌గా ఉండగా.. 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.59,999గా.. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.65,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+512 జీబీ వేరియంట్‌ ధరను శాంసంగ్‌ ఇంకా వెల్లడించలేదు. బ్లూ, గ్రాఫైట్‌, గ్రే, మింట్‌, యెల్లో రంగుల్లో ఏ ఫోన్స్ లభిస్తాయి. అక్టోబర్‌ 3 నుంచి భారతదేశంలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రీ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

గెలాక్సీ ఎస్‌24 ఎఫ్‌ఈలో 6.7 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెడ్జ్ రిఫ్రెష్‌ రేటు, 4నానో మీటర్‌ డెకా కోర్‌ కలిగిన ఎగ్జినోస్‌ 2400ఈ ప్రాసెసర్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 14తో కూడిన వన్‌యూఐ 6.1తో పనిచేస్తుంది. వెనుకవైపు 50 ఎంపీ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన కెమెరా, 8 ఎంపీ టెలిఫొటో లెన్స్‌, 12 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాలను ఇచ్చారు. సెల్ఫీల కోసం 10 ఎంపీ కెమెరా ఉంది. 4700 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఉన్నాయి. ఐపీ 68 రేటింగ్‌ కలిగిన ఈ ఫోన్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంటుంది.

Show comments