Samsung Galaxy S24 FE: ‘గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ’ వచ్చేసింది.. ధర,ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!
- ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్
- ప్రారంభమైన ప్రీ ఆర్డర్లు
- అక్టోబర్ 3 నుంచి విక్రయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy S24 FE Price in India: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ గెలాక్సీ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ’ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ప్రీమియం సెగ్మెంట్‌లో ఏటా తీసుకొచ్చే ఎస్ సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా శాంసంగ్.. కాస్త తక్కువ ధరలో ఫ్యాన్ ఎడిషన్‌ను (ఎఫ్‌ఈ) లాంచ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఏఐ ఫీచర్లనూ ఇందులో అందించింది. ఇందులో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరాను ఇచ్చారు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అన్ని ఫోన్లలోనూ 8జీబీ ర్యామ్ కామన్‌గా ఉండగా.. 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.59,999గా.. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.65,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+512 జీబీ వేరియంట్ ధరను శాంసంగ్ ఇంకా వెల్లడించలేదు. బ్లూ, గ్రాఫైట్, గ్రే, మింట్, యెల్లో రంగుల్లో ఏ ఫోన్స్ లభిస్తాయి. అక్టోబర్ 3 నుంచి భారతదేశంలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రీ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈలో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేటు, 4నానో మీటర్ డెకా కోర్ కలిగిన ఎగ్జినోస్ 2400ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14తో కూడిన వన్‌యూఐ 6.1తో పనిచేస్తుంది. వెనుకవైపు 50 ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన కెమెరా, 8 ఎంపీ టెలిఫొటో లెన్స్, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలను ఇచ్చారు. సెల్ఫీల కోసం 10 ఎంపీ కెమెరా ఉంది. 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. ఐపీ 68 రేటింగ్ కలిగిన ఈ ఫోన్‌లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!