NTV Telugu Site icon

Samsung Galaxy M34 5G Launch: శాంసంగ్ నుంచి సూపర్ 5G స్మార్ట్‌ఫోన్.. ఓఐఎస్ ఫీచతో కెమెరా! ధర ఎంతంటే

Samsung Galaxy M34 5g New

Samsung Galaxy M34 5g New

Samsung Galaxy M34 5G Launch and Price in India: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ‘శాంసంగ్‌’.. ఎం సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎం34 (Samsung Galaxy M34 5G) స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్‌లో రిలీజ్ చేయనుంది. జూలై 7న భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఇటీవల ఈ ఫోన్ యొక్క కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. విశేషం ఏంటంటే.. గెలాక్సీ ఎం34 స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన 50 మెగాపిక్సెల్ నో షేక్ కెమెరా ఉండనుందట. ఈ ఫోన్ ధర మరియు ఫీచర్లను తెలుసుకుందాం.

Samsung Galaxy M34 5G Camera:
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. మాన్‌స్టర్ షాట్ 2.0 ఫీచర్‌ను ఈ స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉన్నందున మీరు సరికొత్త ఫోటోగ్రఫీ అనుభవాన్ని పొందుతారు. ఈ ఫీచర్ కెమెరా వెనుక ఉన్న ఏఐ ఇంజిన్‌కు శక్తినిస్తుంది. వినియోగదారులు ఒకే షాట్‌లో 4 వీడియోలు, 4 ఫోటోలను క్యాప్చర్ చేయడానికి వీలుంటుంది. 48MP ప్రైమరీ సెన్సార్, 8MP సెకండరీ కెమెరా, 5MP కెమెరా ఉండనుంది. సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Also Read: Mexico: తుపాకీతో బెదిరించి 14 మంది భద్రతా మంత్రిత్వ శాఖ సిబ్బంది కిడ్నాప్

Samsung Galaxy M34 5G Battery:
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్‌ఫోన్‌ 120Hz సూపర్ అమోలెడ్‌ స్క్రీన్‌తో వస్తుంది. ఇది విజన్ బూస్టర్ టెక్నాలజీతో రానుంది. దాంతో ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా స్క్రీన్‌ అద్భుతంగా కనిపిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,000mAh బ్యాటరీని అందించనుంది. ఈ బ్యాటరీతో ఫోన్ 2 రోజుల వరకు పని చేస్తుంది. టైప్-C పోర్ట్‌ను కలిగి ఉండనుంది. ఈ ఫోన్ బరువు దాదాపు 199 గ్రాములు ఉండే అవకాశం ఉంది.

Samsung Galaxy M34 5G Price:
నివేదికల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర 20వేల సెగ్మెంట్‌లో ఉంటుంది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎం33 5G స్మార్ట్‌ఫోన్ 6GB + 128GB స్టోరేజ్ మోడల్‌ రూ. 15,999 ప్రారంభ ధరతో వస్తుంది. అయితే గెలాక్సీ ఎం34 ధర ఎక్కువగా ఉండనుంది.

Samsung Galaxy M34 5G Disply:
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో రానుంది. 6.6-అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోల్డ్‌ డిస్‌ప్లేతో రానుంది. సెల్ఫీ కెమెరాతో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్డ్ డిజైన్‌ ఉంటుంది. ఫోన్ హుడ్ కింద ఉన్న మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్‌సెట్ ఉంటుంది. గెలాక్సీ ఎం34 సరికొత్త ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్‌తో రానుంది. ఈ ఫోన్ స్లిమ్ మరియు సొగసైనదిగా కనిపిస్తుంది.

Also Read: Upcoming 5G Smartphones: జూలైలో విడుదల కానున్న టాప్ 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!