Samsung Galaxy M05 Lanched With 8 Thousand in India: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘శాంసంగ్’ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లతో పాటు బడ్జెట్ ఫోన్‌లను కూడా రిలీజ్ చేస్తోంది. తాజాగా శాంసంగ్ బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ‘శాంసంగ్ గెలాక్సీ ఎం05’ పేరుతో భారత మార్కెట్‌ల్లోకి తీసుకొచ్చింది. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో తీసుకొచ్చిన ఈ మొబైల్ ధర కేవలం 8 వేలే. అయితే ఈ మొబైల్ 4జీ నెట్‌వర్క్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇందులో రెండేళ్ల పాటు ఓఎస్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉంటాయి. గెలాక్సీ ఎం05 ఫీచర్స్ ఓసారి చూద్దాం.
శాంసంగ్ గెలాక్సీ ఎం05 ఫోన్ ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.7,999గా ఉంది. మింట్ గ్రీన్ రంగులో లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్‌తో పాటు ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇందులో 6.74 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ పీఎల్‌ఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐతో ఇది పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఉపయోగించారు.
Also Read: Realme P2 Pro Price: రియల్‌మీ నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్స్, లాంచ్ ఆఫర్స్ ఇవే!
శాంసంగ్ గెలాక్సీ ఎం05 ఫోన్ డ్యూయల్ నానో సిమ్‌కు సపోర్ట్ చేస్తుంది. మైక్రోఎస్‌డీ కార్డ్ సాయంతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచువచ్చు. ఈ ఫోన్ వెనక వైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ కెమెరా అమర్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వగా.. ఇది 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.