Realme P2 Pro 5G Price in India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘రియల్‌మీ’ నుంచి మరో 5జీ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ‘రియల్‌మీ పీ2 ప్రో 5జీ’ పేరిట తీసుకొచ్చింది. 5,200 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 600 ప్రైమరీ కెమరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాను ఇందులో ఇచ్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ మొబైల్ ధర, ఫీచర్లు వివరాలను ఓసారి చూద్దాం.
Realme P2 Pro 5G Price:
రియల్‌మీ పీ2 ప్రో ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.21,999గా..12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. హై ఎండ్ 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.27,999గా కంపెనీ నిర్ణయించింది. ఈగల్ గ్రే, గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్స్ లభిస్తాయి. రియల్‌మీ వెబ్‌సైట్‌తో పాటు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వేదికగా రియల్‌మీ పీ2 ప్రోను కొనుగోలు చేయొచ్చు.
Realme P2 Pro 5G Offers:
సెప్టెంబర్ 17 ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ‘ఎర్లీ బడ్ సేల్’ నిర్వహించనున్నట్లు రియల్‌మీ కంపెనీ తెలిపింది. ఈ సేల్‌లో రియల్‌మీ పీ2 ప్రోను కొనుగోలు చేసిన వారికి రూ.2,000 వరకు రాయితీ లభిస్తుంది. మరోవైపు ఎంపిక చేసిన కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.1,000 అదనపు డిస్కౌంట్ దక్కనుంది. మూడు నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
Realme P2 Pro 5G Specifications:
రియల్‌మీ పీ2 ప్రో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్‌డ్ అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేటు, 240 హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేటు, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఐపీ 65 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌తో దీన్ని తీసుకొచ్చారు. 4 ఎన్ఎం ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్2 ప్రాసెసర్ ఇందులో ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ5తో ఈ ఫోన్ పనిచేస్తుంది. వెనక వైపు 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 ప్రైమరీ సెన్సర్, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా అమర్చారు. సెల్ఫీల కోసం 32ఎంపీ కెమెరాను ఇచ్చారు. 5200 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ.. 80 వాట్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.