శామ్‌సంగ్ సంస్థ బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని గ్లోబల్ మార్కెట్‌లో కొత్తగా ‘గెలాక్సీ A07s’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ లో విభిన్న ఫీచర్లు, కొత్త సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో ఆకట్టుకుంటోంది. ఈ డివైజ్ లో 6.7 అంగుళాల HD+ PLS LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల స్క్రీన్ వినియోగం చాలా స్మూత్‌గా ఉంటుంది. దుమ్ము, నీటి చుక్కల నుండి రక్షణ కోసం ఈ ఫోన్‌కు IP54 రేటింగ్ కూడా ఇచ్చారు.
కార్యాచరణ విషయానికి వస్తే, ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G99+ చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది 4GB ర్యామ్‌తో పాటు 64GB మరియు 128GB స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డ్ సహాయంతో 2TB వరకు విస్తరించుకునే సదుపాయం కలదు. ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 10x డిజిటల్ జూమ్‌ను సపోర్ట్ చేసే 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉంది.
సాఫ్ట్‌వేర్ విషయంలో ఈ ఫోన్ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. బడ్జెట్ విభాగంలో ఉన్నప్పటికీ, శామ్‌సంగ్ ఈ ఫోన్‌కు వరుసగా 6 సంవత్సరాల పాటు OS అప్‌గ్రేడ్‌లను అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇది టైప్-సి పోర్ట్ ద్వారా చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలపడం జరిగింది.
కనెక్టివిటీ పరంగా 4G LTE, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3 మరియు GPS ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ జొర్డాన్‌లో అందుబాటులోకి ఉంది. దీని 4GB + 64GB వేరియంట్ ధర దాదాపు రూ.15,963 కాగా, 4GB + 128GB వేరియంట్ ధర సుమారు రూ.19,988గా నిర్ణయించారు. బ్లాక్, గ్రీన్ , లైట్ వైలెట్ రంగుల్లో లభించే ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

