Site icon NTV Telugu

120Hz డిస్‌ప్లే, Dimensity 6300తో Samsung Galaxy A07 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా!

Samsung Galaxy A07 5g

Samsung Galaxy A07 5g

Samsung Galaxy A07 5G: శాంసంగ్ (Samsung) తన A-సిరీస్‌లో కొత్తగా గాలక్సీ A07 5G (Galaxy A07 5G) స్మార్ట్‌ఫోన్‌ ను భారత్ లో లాంచ్ చేసింది. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ సపోర్ట్‌తో ఈ ఫోన్ బడ్జెట్ 5G సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకర్షించేలా తాయారు చేయబడింది.

OPPO K13 Price Hike: షాకింగ్.. తగ్గాల్సింది పోయి భారీగా పెరిగిన ‘ఒప్పో కే13’ ధర!

ఈ కొత్త మొబైల్ లో 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ అందించారు. ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో ‘గ్లాస్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ పాలిమర్ (GFRP)” ఉపయోగించారు. ఇది బలాన్ని పెంచుతూ స్లిమ్ డిజైన్‌ను అందిస్తుంది. అలాగే ఇది IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉంది. ఈ మొబైల్ లైట్ వైలెట్, లైట్ గ్రీన్, బ్లాక్ రంగులలో లభిస్తుంది. ఇంకా ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సర్ ఉండగా.. సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించారు.

ఇందులో అత్యాధునిక మీడియాటెక్ డిమెంసిటీ 6300 ప్రాసెసర్ ఉంది. 4GB / 6GB RAM, 128GB స్టోరేజ్ తో వస్తుంది. అవసరమైతే మైక్రోSD ద్వారా 1TB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది (బాక్స్‌లో ఛార్జర్ ఉండదు). ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.0పై పనిచేస్తుంది. శాంసంగ్ ఈ మోడల్‌కు 6 సంవత్సరాల OS అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదనంగా Samsung Knox Vault సెక్యూరిటీ సిస్టమ్, ఫింగర్‌ప్రింట్ మరియు ఫేస్ అన్‌లాక్, Auto Blocker ఫీచర్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

Xiaomi 18 Concept Design: నాలుగు 50MP కెమెరాస్, 6600mAh బ్యాటరీ.. హై-ఎండ్ ఫీచర్లతో వస్తున్న షావోమీ 18!

శాంసంగ్ గాలక్సీ A07 5G రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో 4GB + 128GB వేరియంట్ రూ. 15,999 కాగా, 6GB + 128GB వేరియంట్ రూ. 17,999 గా నిర్ణయించారు. ఇంకా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు లేదా UPI ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,000 క్యాష్‌ బ్యాక్ లభిస్తుంది. అలాగే 18 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ ఉంది. ఈ ఫోన్ శాంసంగ్ స్టోర్లు, రిటైల్ అవుట్‌లెట్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది.

Exit mobile version