Samantha : సిటాడెల్ వెబ్ సిరీస్ కు డబ్బింగ్ మొదలుపెట్టిన సమంత..ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది ఖుషి మరియు శాకుంతలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఖుషి మూవీ యావరేజ్ గా నిలిచింది.విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకున్నా కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో ఓ మోస్తారు వసూళ్లతోనే ఈ మూవీ సరిపెట్టుకున్నది.అలాగే చారిత్రక కథాంశంతో తెరకెక్కిన శాకుంతలం మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 20 కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాధతో దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం మూవీని త్రీడీలో తెరకెక్కించాడు. సమంత హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ మైథాలజీ మూవీ ఇదే. కానీ ఈ ప్రయోగం సామ్‌కు మంచి విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది.గత ఏడాది సమంత నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్.. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తిచేసిన తర్వాతే సమంత సినిమాలకు గ్యాప్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకునే వరకు సినిమాలకు దూరంగా ఉండాలని ఆమె నిశ్చయించుకున్నది. తాను అంగీకరించిన కొన్ని సినిమాలను వదులుకున్నది. ప్రస్తుతం సమంత పూర్తిగా రికవరీ అయినట్లు సమాచారం. సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ మరియు ప్రమోషన్స్ పనులతోనే మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా డబ్బింగ్ స్టూడియోలో సమంత సిటాడెల్ లో తన పాత్రకు డబ్బింగ్ చెబుతోన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. హిందీ సిరీస్ రషెస్ చూశానని, చాలా బాగా వచ్చాయంటూ ఓ పోస్ట్‌పెట్టింది. అలాగే వరుణ్‌ధావన్ మరియు డైరెక్టర్స్ రాజ్‌డీకేలతో కలిసి దిగిన ఫోట్‌ను షేర్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి. సమంత రీఎంట్రీతో ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు.సమంత గతంలో రాజ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ మ్యాన్ 2లో నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో సమంత నటించింది. ఫ్యామిలీ మ్యాన్ 2తోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి అడుగులోనే విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను అందుకున్నది.. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ 2కు మించి ఛాలెంజింగ్‌గా సిటాడెల్ సిరీస్‌లో సమంత క్యారెక్టర్ ఉండబోతున్నట్లు సమాచారం.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Tags
- #varundhavan
- Citadel
- Samantha
తాజావార్తలు
-
US Strikes on Iran: ఇరాన్‌పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!