Site icon NTV Telugu

Samantha: ఇబ్బంది పెడుతున్న ఆ జబ్బు.. మళ్లీ ట్రీట్మెంట్‌కు సమంత?

Samantha

Samantha

Samantha to stay for months in US for treatment: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుంచి ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటుందనే వార్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆమె చేస్తున్న సినిమాల షూటింగ్ లు పూర్తిచేసి తర్వాత ఎలాంటి సినిమాలు ఒప్పుకోకుండా ఆమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంటుంది అనే వార్త ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే ఏడాది పాటు బ్రేక్ తీసుకోవడానికి గల కారణం ఆమె చికిత్స తీసుకోవాల్సి రావడమే అని తెలుస్తోంది. సమంత మయోసైటిస్ అనే ఒక ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే చికిత్స తీసుకుంటే ఆమె కొంత కోలుకుంది కూడా. ఈ నేపద్యంలో వరుసగా సినిమా షూటింగ్లలో పాల్గొంటుంది. అయితే ఆ వ్యాధి కోసం అమెరికాలో చికిత్స తీసుకునేందుకు ఆమె సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Divi Vadthya: రాకుమారిలా హొయలు పోతూ సెగలు రేపుతున్న దివి.. ఫోటోలు చూశారా?

ఇక ఇప్పటికే అమెరికాలో ఉన్న డాక్టర్ను సంప్రదించగా ఆయన చెక్ చేసి ఈ వ్యాధికి అమెరికాలో కొన్ని నెలల పాటు ఉండి చికిత్స తీసుకోవాలని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపద్యంలో సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒప్పుకుని మధ్యలో ఉన్న సినిమాలు పూర్తి చేసి ఆగస్టు నెల మొదట్లో ఆమె అమెరికా బయలుదేరి వెళుతున్నట్లుగా తెలుస్తోంది. ఎవరి దగ్గర అయితే ఆమె అడ్వాన్సులు తీసుకుందో ఆ నిర్మాతల అడ్వాన్స్ తిరిగి ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను పూర్తిగా కోలుకొని వచ్చిన తర్వాత చ్చితంగా సినిమాలు మీతో చేస్తానని సమంత వారికి హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. కానీ అందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం మీద ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. ఇక చివరిగా సమంత ఖుషి అనే సినిమా షూటింగ్లో పాల్గొంది. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

Exit mobile version