సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. సినిమాలతో ఎంతగా బిజీగా ఉన్నా కూడా జిమ్ లో వర్కౌట్స్ మాత్రం ఆపదు.. ఫిట్ నెస్ కోసం తెగ కష్ట పడుతుంది. ఆమె భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో నెట్టింట షేర్ చేసింది.. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది..
ఇక సమంత ప్రస్తుతం పూర్తిగా తన ఆరోగ్యం పైనే ఫోకస్ పెడుతోంది. సామ్ చివరగా ఖుషి చిత్రంలో విజయ్ దేవరకొండకి జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంత ఏ చిత్రానికి సైన్ చేయలేదు. తన ఆరోగ్యం కుదుట పడే వరకు సామ్ దాదాపు ఏడాది విరామం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.. ఆ వ్యాధి నుంచి సామ్ కోలుకున్నప్పటికీ మునుపటి ఫిట్ నెస్ సాధించేందుకు సామ్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. యోగా, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తోంది. అంతే కాదు జిమ్ లో కసరత్తులు చేస్తూ చెమటలు చిందిస్తోంది..
తాజాగా అమ్మడు జిమ్ లో అంత్యంత కష్టమైన వర్కౌట్స్ చేస్తున్న దృశ్యాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంది. ఎంత కష్టమైనప్పటికీ ఛాలెంజ్ గా తీసుకుని సామ్ వర్కౌట్స్ చేస్తోంది. ఈ దృశ్యాలు నెటిజన్లని కదిలిస్తున్నాయి.. సమంత డెడికేషన్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ఆమె ఫ్యాన్స్ మాత్రం కష్టాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.. పక్కనే జిమ్ ట్రైన్ జునైద్ ఉన్నాడు. సమంత వర్కౌట్స్ చేసేలా ఆమెని మోటివేట్ చేస్తున్నాడు.. ఈ అమ్మడు ప్రస్తుతం షూటింగ్ లకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. వరుసగా గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ పరువాల విందు వడ్డిస్తోంది.