Kissik Song: శ్రీలీల.. చంపేశావ్ పో: సమంత
- డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్
- రికార్డు క్రియేట్ చేసిన కిస్సిక్ సాంగ్
- శ్రీలీల డ్యాన్స్‌పై సమంత పొగడ్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘పుష్ప – ది రైజ్’ చిత్రంలో మాదిరిగానే సెకండ్ పార్ట్‌లోనూ డైరెక్టర్ సుకుమార్ ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశాడు. ‘ఊ అంటావా’ సాంగ్‌లో స్టార్ హీరోయిన్ సమంత చిందేయగా.. కిస్సిక్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో యంగ్ బ్యూటీ శ్రీలీల స్టెప్పులేసింది. రీసెంట్గా చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ఈ కిస్సిక్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా.. సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. రిలీజ్ అయిన 18 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ రాబట్టి.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ వ్యూస్‌తో సౌత్ ఇండియాలో ఎక్కువ మంది చూసిన సాంగ్‌గా కిస్సిక్ రికార్డు క్రియేట్ చేసింది.
ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో ఎక్కువ మంది చూసిన సాంగ్‌గా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ‘గోట్’ సినిమాలోని ‘విజిల్ పోడు’ టాప్-1గా కొనసాగుతుంది. ఈ సాంగ్ 24 గంటల్లో 24. 88 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఈ రికార్డును అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేసింది మన కిస్సిక్. కేవలం తెలుగు లిరికల్ సాంగ్ వ్యూస్‌తో ఈ రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఇక ఈ పాటలో శ్రీలీల డ్యాన్స్ మామూలుగా ఉండదని.. లిరికల్ సాంగ్‌తో తేలిపోయింది. ఏకంగా బన్నీని సైతం డామినేట్ చేసినట్టుగా చర్చించుకుంటున్నారు. సమంత కంటే శ్రీలీలనే కుమ్మేసిందనే టాక్ కూడా నడుస్తోంది.
Also Read
ఈ కిస్సిక్ సాంగ్ పై సమంత స్పందించింది. కస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌తో సెగలు పుట్టించిందని పేర్కొన్నారు. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో మూడు ఫైర్ ఎమోజీలు పెడుతూ.. శ్రీలీల చంపేశావ్ అని షేర్ చేసింది. అంతేకాదు ‘సైలెంట్‌గా ఉండండి.. పుష్ప 2 కోసం వెయిట్ చేయండి’ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. మరి కిస్సిక్ ఫుల్ వీడియో సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం శ్రీలీల డ్యాన్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 5న ఎంతలా దుమ్ము లేపుతుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!