Samantha Film Break: సమంత కీలక నిర్ణయం.. ఇక సినిమాలకు దూరం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Samantha is going to take 1 Year Break From Movies: సీనియర్ హీరోయిన్ సమంత కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది. సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని సమంత నిర్ణయిచుకున్నారట. చేతిలో ఉన్న రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన వెంటనే సామ్ బ్రేక్ తీసుకోనున్నారట. తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం కోసమే సినిమాలకు సుదీర్ఘ విరామం ఇస్తున్నారట. ఈ విషయం తెలిసిన సమంత ఫాన్స్ నిరాశ చెందుతున్నారు.
సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేసురుకుంది. మరో మూడు రోజులో ఖుషి చివరి షెడ్యూల్ కూడా పూర్తవుతుంది. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించాడు. మరోవైపు సమంత చేతిలో ఉన్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది.
Also Read
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
ప్రస్తుతం సమంత ఎలాంటి కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ చిత్రాలకు సైన్ చేయదు. గతంలో తీసుకున్న నిర్మాతలకు అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశారట. దాదాపుగా ఓ సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని సామ్ నిర్ణయం తీసుకున్నారట. ఈ సమయాన్ని తన ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి మరియు అదనపు చికిత్స కోసం వెచ్చించనున్నారట. వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతే సమంత తిరిగి సినిమాలపై దృష్టి పెట్టనున్నారని సమాచారం. ‘ఖుషి’ సినిమా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంటారో లేదో.
ఇటీవల విడుదల అయిన ‘శాకుంతలం’ సినిమా సమంతకు భారీ షాక్ ఇచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ భారీ బడ్జెట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో తన తర్వాతి ప్రాజెక్టులపై సమంత ఆచితూచి అడుగులు వేస్తుందనుకున్నారు అంతా. ఈ లోపే బ్రేక్ తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు.
Also Read: Tollywood Upcoming Multistarrer: టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్.. ముగ్గురు హీరోలు కలిసి సినిమా!
తాజావార్తలు
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..