NTV Telugu Site icon

Samantha Film Break: సమంత కీలక నిర్ణయం.. ఇక సినిమాలకు దూరం?

Samantha

Samantha

Actress Samantha is going to take 1 Year Break From Movies: సీనియర్ హీరోయిన్ సమంత కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది. సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని సమంత నిర్ణయిచుకున్నారట. చేతిలో ఉన్న రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన వెంటనే సామ్ బ్రేక్ తీసుకోనున్నారట. తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం కోసమే సినిమాలకు సుదీర్ఘ విరామం ఇస్తున్నారట. ఈ విషయం తెలిసిన సమంత ఫాన్స్ నిరాశ చెందుతున్నారు.

సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేసురుకుంది. మరో మూడు రోజులో ఖుషి చివరి షెడ్యూల్ కూడా పూర్తవుతుంది. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించాడు. మరోవైపు సమంత చేతిలో ఉన్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది.

Also Read: Zimbabwe CWC 2023: స్కాట్లాండ్‌ చేతిలో ఓటమి.. ప్రపంచకప్‌ 2023కి జింబాబ్వే దూరం! రెండో బెర్తు ఎవరిదంటే

ప్రస్తుతం సమంత ఎలాంటి కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ చిత్రాలకు సైన్ చేయదు. గతంలో తీసుకున్న నిర్మాతలకు అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశారట. దాదాపుగా ఓ సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని సామ్ నిర్ణయం తీసుకున్నారట. ఈ సమయాన్ని తన ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి మరియు అదనపు చికిత్స కోసం వెచ్చించనున్నారట. వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతే సమంత తిరిగి సినిమాలపై దృష్టి పెట్టనున్నారని సమాచారం. ‘ఖుషి’ సినిమా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంటారో లేదో.

ఇటీవల విడుదల అయిన ‘శాకుంతలం’ సినిమా సమంతకు భారీ షాక్ ఇచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ భారీ బడ్జెట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో తన తర్వాతి ప్రాజెక్టులపై సమంత ఆచితూచి అడుగులు వేస్తుందనుకున్నారు అంతా. ఈ లోపే బ్రేక్ తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు.

Also Read: Tollywood Upcoming Multistarrer: టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్.. ముగ్గురు హీరోలు కలిసి సినిమా!

 

Show comments