NTV Telugu Site icon

Samantha : జిమ్ లో అదిరిపోయే స్టంట్ చేసిన సమంత..

Whatsapp Image 2023 07 26 At 12.04.42 Pm

Whatsapp Image 2023 07 26 At 12.04.42 Pm

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది ఈ భామ.ఈ భామ 2010లో తెలుగులో ఏమాయచేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నిజంగా ఆ సినిమాతో మాయ చేసిందని చెప్పాలి.ఆ సినిమా తరువాత ఈ భామ భాషతో సంబంధం లేకుండా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ భామ రీసెంట్ గా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టాలని ఆశించిన సమంతకు ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. తాజాగా హీరో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తి అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1 న విడుదల కాబోతుంది. ఈ సినిమా నుండి విడుదల అయిన సాంగ్స్ కూడా చాట్ బస్టర్ గా నిలిచాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే సమంత షాకింగ్ నిర్ణయం తీసుకుంది.ఏకంగా ఏడాది పాటు సమంత బ్రేక్ తీసుకుంది. ఏడాది పాటు సమంత ఏ సినిమాలో కూడా నటించదు.గత కొంతకాలంగా ఆమె మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో సమంత కఠోరంగా కష్టపడి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యింది. సిటాడెల్ సిరీస్‌తో పాటు విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాను కూడా పూర్తి చేసేసింది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకున్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కు అప్‌డేట్స్ ఇస్తోంది. కొన్నాళ్ల పాటు ఆధ్యాత్మిక చింతనలో ఉన్న సమంత, బాలిలో స్నేహితులతో కలిసి వెకేషన్‌ను బాగా ఎంజాయ్ చేసింది. జిమ్‌లో ఎక్కువ సేపు బాగా కష్టపడుతుంది. రీసెంట్‌గా సమంత జిమ్ వీడియో ఒకటి షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.. ఆ వీడియో లో ఆమె  ఆక్రో స్టంట్‌ చేసింది.అంటే కాలిపై మరో వ్యక్తి బరువును బ్యాలెన్స్ చేయటం అన్న మాట.దీన్ని రెగ్యులర్‌గా జిమ్నాస్టిక్స్ చేస్తూ వ్యాయామం చేసేవాళ్లు మాత్రమే చేయగలరు. అయితే సమంత ఈ స్టంట్ చేయటంపై నెటిజన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో బాగా వైరల్ గా మారింది.

Show comments