Samantha : జిమ్ లో అదిరిపోయే స్టంట్ చేసిన సమంత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది ఈ భామ.ఈ భామ 2010లో తెలుగులో ఏమాయచేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నిజంగా ఆ సినిమాతో మాయ చేసిందని చెప్పాలి.ఆ సినిమా తరువాత ఈ భామ భాషతో సంబంధం లేకుండా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ భామ రీసెంట్ గా శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టాలని ఆశించిన సమంతకు ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. తాజాగా హీరో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తి అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1 న విడుదల కాబోతుంది. ఈ సినిమా నుండి విడుదల అయిన సాంగ్స్ కూడా చాట్ బస్టర్ గా నిలిచాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే సమంత షాకింగ్ నిర్ణయం తీసుకుంది.ఏకంగా ఏడాది పాటు సమంత బ్రేక్ తీసుకుంది. ఏడాది పాటు సమంత ఏ సినిమాలో కూడా నటించదు.గత కొంతకాలంగా ఆమె మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో సమంత కఠోరంగా కష్టపడి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యింది. సిటాడెల్ సిరీస్‌తో పాటు విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాను కూడా పూర్తి చేసేసింది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకున్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ కు అప్‌డేట్స్ ఇస్తోంది. కొన్నాళ్ల పాటు ఆధ్యాత్మిక చింతనలో ఉన్న సమంత, బాలిలో స్నేహితులతో కలిసి వెకేషన్‌ను బాగా ఎంజాయ్ చేసింది. జిమ్‌లో ఎక్కువ సేపు బాగా కష్టపడుతుంది. రీసెంట్‌గా సమంత జిమ్ వీడియో ఒకటి షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.. ఆ వీడియో లో ఆమె ఆక్రో స్టంట్ చేసింది.అంటే కాలిపై మరో వ్యక్తి బరువును బ్యాలెన్స్ చేయటం అన్న మాట.దీన్ని రెగ్యులర్‌గా జిమ్నాస్టిక్స్ చేస్తూ వ్యాయామం చేసేవాళ్లు మాత్రమే చేయగలరు. అయితే సమంత ఈ స్టంట్ చేయటంపై నెటిజన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో బాగా వైరల్ గా మారింది.
Also Read
- PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
తాజావార్తలు
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!